Tollywood Controversies – మొన్నటి దాకా బలగం ఇప్పుడేమో బేబీ,శ్రీమంతుడు

Tollywood Controversies – మొన్నటి దాకా బలగం ఇప్పుడేమో బేబీ,శ్రీమంతుడు

Tollywood Controversies
Tollywood Controversies

Tollywood Controversies ఒక సినిమా స్టోరీ ని పోలి ఇంకొక సినిమా స్టోరీ ఉండడం చాలా కామన్ అది పొరపాటున జరిగితే ఏం ప్రాబ్లం లేదు కానీ కావాలని వేరే వాళ్ళ స్టోరీని కాపీ చేస్తేనే ప్రాబ్లం. మామూలుగా సినీ ఇండస్ట్రీలో కాంట్రావర్సెస్ చాలా కామన్ ఎప్పుడు ఏదో లొల్లి జరుగుతూనే ఉంటుంది అయితే రీసెంట్ గా ఒకరీ స్టోరీని ఇంకొకరు కాపీ చేశారు అనే దాని మీద కాంట్రవర్సీ జరుగుతుంది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ మూవీస్ ఏంటో ఆ డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం 

Don’t Mess With Sandeep Reddy

బలగం మూవీ

చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే జబర్దస్త్ కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాకి 3 కోట్లు ఖర్చుపెడితే ఏకంగా 22 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అయితే ఈ సినిమా స్టోరీని వేణు గారు గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ 2014 లో నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ లో పచ్చక పేరుతో రాసిన స్టోరీ నుండి కాపీ చేసాడని ఆరోపించారు మీడియా ముందుకు వచ్చి బలగం టీం మీద విమర్శలు చేశాడు. తన స్టోరీని నామమాత్రపు మార్పులు చేసి బలగం మూవీ తీశారని. దాదాపు 90% స్టోరీ నాదే ఒకవేళ బలగం మూవీ స్టోరీ క్రెడిట్ నాకు ఇవ్వకుంటే పరమైన చర్యలు తీసుకోవాల్సిన వస్తుందని హెచ్చరించారు

 

బేబీ మూవీ

బేబీ మూవీ కి యూత్ ఎంత లో కనెక్ట్ అయ్యారు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా స్టోరీని తన ప్రేమించద్దు అనే షార్ట్ ఫిలిం నుండి కాపీ చేశారని శిరన్ శ్రీరామ్ అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఆరోపించాడు. 2015 లోనే ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ సాయి రాజేష్ గారికి చెప్తే అతను SKN గారితో చెప్పండి అని సలహా ఇచ్చాడంట. కానీ తర్వాత 2023లో తనకు ఏమాత్రం చెప్పకుండా SKN నిర్మాతగా సాయిరాజేష్ డైరెక్టర్ గా బేబీ మూవీ ని అనౌన్స్ చేశారు. తాను రాసుకున్న స్టోరీ అలాగే బేబీ మూవీ స్టోరీ ఒకటే అని తెలుసుకున్న శిరన్ శ్రీరామ్ గారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్టు సమాచారం అతను అన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమా మీద ఇప్పుడు కాపీ చేశారు అని కేసు వేయడం వల్ల ఎన్ని డేస్ ఏం చేశాడు అని అందరూ కామెంట్ చేస్తున్నారు.

 

శ్రీమంతుడు మూవీ

శరత్ చంద్ర అనే రైటర్ డైరెక్టర్ కొరటాల శివ గారి మీద శ్రీమంతుడు స్టోరీని నా స్టోరీ 2012 లో స్వాతి పేపర్లో చచ్చేంత ప్రేమ అనే పేరుతో వచ్చిన నవల నుండి చిన్న చిన్న మార్పులు చేసి శ్రీమంతుడు మూవీ తీశాడని 2017 లో నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు వేసారు. సినిమాలోని హీరో హీరోయిన్ల క్యారెక్టర్జేషన్స్ వెన్నెల కిషోర్ పాత్ర కంపెనీల పేర్లు స్థలాల పేర్లు లాస్ట్ కి ఊరు పేరు దేవరకొండ కూడా తన నవల నుండే కాపీ చేశారని ఆరోపించాడు అప్పటినుండి ఈ కాంట్రవర్సీ అలానే కొనసాగుతుంది ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ శరత్ చంద్ర గారు కొరటాల శివ గారు బహిరంగంగా క్షమాపణ చెప్తే చాలు అని అంటున్నాడు

 

Leave a comment