Telugu Movies Deleted Scenes : పాపం వీళ్లను ఎడిటింగ్ లో లేపేసారు
ఒక సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మూవీని ఎడిట్ చేస్తారు ఆ ఎడిట్ చేసే ప్రక్రియలో సినిమా లెంతి ఎక్కువ ఉందనో లేదంటే కొన్ని సీన్స్ సినిమాకి అవసరం లేదనో సినిమాలోని కొన్ని సీన్స్ ని లేపేస్తారు Telugu Movies Deleted Scenes మామూలుగా ఒక డైరెక్టర్ కి సినిమాని సరిగా తీయడంతో పాటు సినిమాను సరిగా ఎడిట్ చేశారో లేదో చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాలో ఏముండాలి ఎడిటింగ్ లో ఏం తీసేయాలి అన్న విషయం చాలా దగ్గరుండి చూసుకోవాలి
అందుకోసం కొంతమంది డైరెక్టర్ ప్రత్యేకంగా ఎడిటింగ్ ను నేర్చుకుని వాళ్ళ సినిమాలకి వాళ్లే ఎడిటింగ్ చేస్తారు సందీప్ రెడ్డి వంగ అండ్ రాజకుమార్ హిరని వాళ్ళ సినిమాలకి వాళ్లే ఎడిటింగ్ చేస్తారు. ఈ విషయాలను పక్కకు పెడితే కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ లో కొంతమందిని ఎడిటింగ్ లో లేపేసారు ఆ సినిమాలు ఏoటో ఆ సీన్స్ ఏంటో తెలుసుకుందాం…
1. భగవంతు కేసరి
అనిల్ రాబడి డైరెక్షన్లో బాలకృష్ణ గారి హీరోగా వచ్చిన భగవత్ కేసరి సినిమా మంచి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ తో పాటు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అయితే ఈ సినిమాలో ఎడిటింగ్ లో ఒక సాంగ్ ని లేపేసారన్న విషయం చాలామందికి తెలుసు ఉండదు. ఇచ్చి పడ్.. అనే ఒక సాంగ్ ని ఈ సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు తీసేసారు.Telugu Movies Deleted Scenes నిజానికి ఆ సాంగ్ కూడా పెద్దగా బాగుండదు. సినిమాలో ఉండడం కన్నా లేకుంటేనే బాగుంటుందని ఉద్దేశంతో సాంగ్ సినిమాలో నుండి తీసేసారు. ఒకవేళ ఆ సాంగ్ అనేది సినిమాలో ఉండుంటే సినిమాకి ఎఫెక్ట్ అయ్యేది..
2. హనుమాన్ మూవీ
హనుమాన్ మూవీ రిలీజ్ అయిన హనుమాన్ మూవీ నేషనల్ వైడ్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. సినిమాకి నియర్ గా 30 కోట్ల వరకు ఖర్చు పెడితే ఏకంగా వరల్డ్ వైడ్ గా 300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ జనరేషన్లో మన తెలుగు సినిమాల్లో ఇంత ప్రాఫిట్స్ ఏ సినిమాకి కూడా రాలేదని చెప్పాలి..Telugu Movies Deleted Scenes అయితే ఈ సినిమా ట్రైలర్ లో తేజ సజ్జ గారు చిరుతతో పాటు రన్ చేసే ఒక్క సీన్ ఉంటుంది.. ట్రైలర్ చూసిన చాలామంది చిరుత తో ఏమైనా ఫైట్ సీన్ లాంటిది ఉన్నది ఏమో అనుకున్నారు.. కానీ తీరా థియేటర్లో చూస్తే ఆ సీన్ అనేది కనిపించలేదు ఆ సీను కూడా సినిమా ఎడిటింగ్ లో లేపేసారంట.
ఇది కూడా చూడు మావా❤️🥵👇
Crazy Sentiments of Tollywood Directors
3.దూకుడు మూవీ
శ్రీను వైట్ల డైరెక్టర్ గా రవితేజ హీరోగా వచ్చిన దుబాయ్ శీను సినిమా ఇష్టపడని వాళ్ళు ఉండకపోవచ్చు.. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా లేనట్టే.. సినిమా ఇప్పుడు టీవీలో వచ్చిన జనాలు ఎగబడి మరీ చూస్తారు. మీకు దూకుడు సినిమాలోని కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ “దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు” ఆయన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. నిజానికి ఈ డైలాగ్ అనేది దుబాయ్ శీను సినిమాలో ఉంది కానీ మూవీని ఎడిట్ మూవీ లెన్త్ ఎక్కువ అవటం తో కొన్ని సీన్స్ ని డిలీట్ చేశారు.. ఆ సీన్స్ లో ఈ డైలాగ్ కూడా ఉంది.. ఈ సీన్ ఈ డైలాగ్ అన్నది అవసరం లేదని దాన్ని సినిమాలో నుండి తీసేశారు.. తర్వాత దుబాయ్ శీను లోని ఆ డైలాగును దూకుడు మూవీలో వాడారు. దుబాయ్ శీను.. దూకుడు.. సినిమాలకి ఒకరే డైరెక్టర్ అవ్వడం వల్ల ఈజీగా ఆ సినిమాలోని డైలాగ్ ఎడిటింగ్ లో లేపేసి ఈ సినిమాలో ఇరికించారు..
4. గుంటూరు కారం
త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో బజ్జీల పిల్లగా చాలా ఫేమస్ అయిన కుషిత అనే అమ్మాయిని తీసుకున్నారని అనౌన్స్ చేశారు. అది చూసిన చాలామంది అది నిజమో లేక కలయా అని నమ్మలేకపోయారు.. అయితే నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశారంట కానీ ఫైనల్ ఎడిట్ లో తన పాత్రని లేపేశారు ఈ విషయాలో తాను బాగా బాధపడిందంట. ఈ విషయం గురించి మూవీ టీం కి అడిగితే తనతో పాటు నటించిన అందరూ యాక్టర్ ల సీన్స్ ని లేపేసారనీ తెలిసిందే. దీంతో అందరితోపాటు తన క్యారెక్టర్ ని లేపేసేసరికి చేసేదేం లేక లైట్ తీసుకుంది..
5. ఆచార్య మూవీ
కొరటాల శివ గారు ఆడియన్స్ నీ పాదఘట్టనికి పంపించిన సినిమా ఆచార్య. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చిరంజీవి గారికి జోడిగా కాజల్ గారిని తీసుకున్నారు దీంతో ఫాన్స్ అయితే మస్తు ఖుషి అయ్యారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్లి చూస్తే అక్కడ మూవీలో కాజల్ కనిపించలేదు. దీంతో కాజల్ గారి వీరాభిమానులు చాలా హర్ట్ అయ్యారు. అసలు ఏం జరిగిందేంటంటే కొరటాల శివ గారు ఆచార్య (చిరంజీవి) క్యారెక్టర్ కి హీరోయిన్ అవసరమా అని కాజల్ గారిని మూవీలో నుండి లేపేసారు అలాగే అదే టైంలో కాజల్ గారు ప్రెగ్నెన్సీ తో ఉండడంతో తాను కూడా మూవీలో నుండి వెళ్ళపోయింది..