Story Wrote for One But Film With Another : ఒక్కరి కోసం స్టోరీ రాసి ఇంకొకరితో సినిమా తీశారు
ప్రభాస్ గారితో రాజమౌళి గారు మగధీర కంటే ముందే బాహుబలి సినిమా గురించి మాట్లాడాడు.Story Wrote for One But Film With Another నిజానికి బాహుబలి స్టోరీని ప్రభాస్ కోసమే రాసుకొన్నారు. మగధీర సినిమాతో రాజమౌళి గారికి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. అప్పుడు ప్రభాస్ వాళ్ళ ఇంట్లో రాజమౌళి గారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా బాహుబలి సినిమా ప్రభాస్ తో చేస్తాడా లేదా అని అనుకున్నారంట. కానీ ఇచ్చిన మాట ప్రకారం బాహుబలి స్టోరీని ప్రభాస్ గారితోనే తీసి ఇండస్ట్రీట్ కొట్టాడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మామూలుగా డైరెక్టర్స్ సినిమా స్టోరీ రాసుకోవడం అయ్యాక హీరో కోసం ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతారు. కానీ ఒక హీరో కోసమే స్టోరీ రాసుకొని అదే హీరోతో సినిమా చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని ఒక హీరో కోసం సినిమా స్టోరీ రాసుకొని కొన్ని రీజన్స్ వల్ల ఇంకొక హీరో తో సినిమా తీసిన కొంతమంది డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం..
1. ప్రభాస్
తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన తని ఒరువన్ మూవీని తెలుగులో రామ్ చరన్ ధృవ అనే పేరుతో రీమేక్ చేసాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో 50 కోట్లతో తీస్తే ఏకంగా 132 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా గారు తని ఒరువన్ ఒరిజినల్ స్టోరీని ప్రభాస్ గారిని దృష్టిలో ఉంచుకొని ప్రభాస్ కోసమే రాసుకున్నాడంట. తర్వాత ఈ సినిమా స్టోరీ ని ప్రభాస్ గారికి చెప్తే ఆ పోలీసు రోల్ నటించడం ఇష్టం లేక ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. దీంతో డైరెక్టర్ మోహన్ రాజా గారు ఈ సినిమాని వాళ్ళ బ్రదర్ అయిన జయం రవి గారితో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
2. అల్లు అర్జున్
అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్ గారిని దృష్టిలో ఉంచుకుని రాసుకున్నారు అంట. తర్వాత ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్ గారికి వినిపిస్తే ఆ క్యారెక్టర్ లో నేను సెట్ కానని రిజెక్ట్ చేశాడని సమాచారం. అలాగే బయట వినిపిస్తున్న ఇంకొక విషయం ఏమిటంటే అర్జున్ రెడ్డి స్టోరీని రాసుకున్న తర్వాత అల్లు అర్జున్ గారిని కలిసి వినిపించే అవకాశం రాలేదంట. దీంతో దీన్ని తర్వాత శర్వానంద్ చెప్తే ఆ క్యారెక్టర్ లో నటిస్తే సినీ కెరీర్ కి ఏదైనా ప్రాబ్లం అవుద్దేమోనని నో చెప్పాడంట. ఆ తర్వాతే విజయ్ దేవరకొండ గారిని కలిశాడు అతను ఒప్పుకోవడంతో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.అల్లు అర్జున్ గారి కోసం రాసుకున్న స్టోరీని ఫైనల్ విజయ్ దేవరకొండతో చేశాడన్నమాట.
3. సంజయ్ దత్
బాహుబలి సినిమాలో సంజయ్ దత్ గారు ఉంటే ఎలా ఉంటుంది.. వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా! బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ కి అనుష్క కి రాజమౌళి గారికి ఎంత పేరొచ్చిందో ఈ సినిమాలో కట్టప్ప రోల్ చేసిన సత్యరాజ్ గారికి కూడా అంతే పేరు వచ్చింది. అయితే ఈ సినిమా స్టోరీ రాసిన విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాసేటప్పుడు కట్టప్ప క్యారెక్టర్ కోసం బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గారిని దృష్టిలో ఉంచుకుని రాసుకున్నారు అంట. అయితే అప్పటికే సంగీత గారు జైల్లో ఉన్నారు. అలాగే జైల్లో నుండి విడుదలవ్వడం అనుకున్న దానికంటే లేట్ అయింది. దీంతో బాహుబలి మూవీ టీం సత్యరాజ్ గారిని కట్టప్ప క్యారెక్టర్ కోసం తీసుకున్నారు
4. రవితేజ
రవితేజ అండ్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన వెంకీ దుబాయ్ శీను మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.Story Wrote for One But Film With Another ఈ సినిమాలను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అయితే మంచి విష్ణు గారి సినిమాల్లో ఏదైనా బెస్ట్ మూవీ ఉందంటే అది ఢీ అని చెప్పాలి. ఢీ స్టోరీని ఈ సినిమా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు ముందుగా రవితేజ గారి కోసం గారిని దృష్టిలో ఉంచుకొని రాసుకున్నారు అంట. అయితే ఒక రోజు మోహన్ బాబు గారు శ్రీనువైట్ల దాన్ని ఇంటికి పిలిపించుకొని ఏదైనా మంచి స్టోరీ ఉంటే చెప్పమన్నాడంట ప్రస్తుతం స్టోరీస్ ఏం లేవు కానీ రవితేజ గారితో ఒక మూవీ చేస్తున్నాను తర్వాత చేద్దాం అన్నట్టుగా మాట్లాడాడు అంట. అయితే ఆ స్టోరీ చెప్పమని అడిగాడంట. స్టోరీ విన్న మోహన్ బాబు గారికి ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఆ స్టోరీని మంచి విష్ణు చేస్తే బాగుంటుంది అని అటు శ్రీనువైట్ల గారిని ఇటు రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒప్పించాడంట నిజం చెప్పాలంటే ఒకవేళ ఢీ మూవీ రవితేజ హీరోగా వస్తే కచ్చితంగా మరో వెంకీ అయ్యేది
5. మహేష్ బాబు
పోకిరి అండ్ బిజినెస్ మాన్ లాంటి మాస్ మూవీస్ తర్వాత పూరి జగన్నాథ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో జనగణమన మూవీ రావాల్సింది. నిజానికి జనగణమన మూవీ పూరి జగన్నాథ్ గారి డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమాని ప్రత్యేకంగా మహేష్ బాబు గారి కోసమే రాసుకున్నాడు కానీ బిజినెస్ మాన్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ గారీ మూవీస్ పెద్దగా ఆడలేదు. తర్వాత ఒక ఇంటర్వ్యూలో పూరి గారు మహేష్ బాబు గారితో సినిమా తీయాలని నాకు కూడా ఉంది,కానీ అతను నేను ఫామ్ లో ఉంటేనే ఛాన్స్ ఇస్తాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఏదేమైనాప్పటికీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో జనగణమన మూవీ రావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.
2 thoughts on “Story Wrote for One But Film With Another : ఒక్కరి కోసం స్టోరీ రాసి ఇంకొకరితో సినిమా తీశారు”