Our heros Special Talents : మన యాక్టర్స్ కి ఈ టాలెంట్ కూడా ఉందంటే నమ్ముతారా??
ఒక సినిమా తీయడానికి డైరెక్టర్ హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఇలా చాలామంది అవసరమవుతారు. ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడానికి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఉంటారు.
ఇండస్ట్రీకి వచ్చిన హీరోస్ చాలావరకు హీరోస్ గానే కొనసాగుతారు Our heros Special Talents కానీ కొంతమంది హీరోస్ అటు ఆక్టింగ్ తో పాటు ఇటు సినిమా ఇండస్ట్రీలో వేరే పనులు కూడా చేస్తున్నారు మరి ఆ హీరోస్ ఎవరో ఆ పనులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. అల్లు అర్జున్ గారు
అల్లు అర్జున్ గారు హీరోగా ఒక రేంజ్ లో యాక్టింగ్ చేస్తాడు.. డాన్సర్ గా ఒక రేంజ్ లో డాన్స్ చేస్తాడు… అయితే అల్లు అర్జున్ గారు కొరియోగ్రాఫర్ గా మారి ఒక్క పాటను కొరియోగ్రఫీ చేశాడన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గుడుంబా శంకర్ మూవీలో “చిలుకమ్మ ముక్కుకి దొండ పండు కి ఏనాడో రాసిపెట్టింది” అని ఒక సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ కి అల్లు అర్జున్ గారే కొరియోగ్రఫీ చేశాడు..
2. జూనియర్ ఎన్టీఆర్ గారు
చిన్న వయసులోనే ఇండస్ట్రీని ఏలిన హీరో మన ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిని మన టాలీవుడ్ లో ఆల్ రౌండర్ అంటారు. ఒక హీరో గానే కాకుండా యాక్టర్ గా హోస్ట్ గా సింగర్ గా ఇలా పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా ఎన్టీఆర్ గారి తర్వాతే అన్నట్టుగా నటిస్తాడు ఏదైనా ఈజీగా చేయగలుగుతాడు దీంతోపాటు ఒక సినిమాకి కొరియోగ్రాఫర్ గా కూడా పని చేశాడు అదే రభస మూవీ.Our heros Special Talents ఈ సినిమాలో మొదటి పాటకు ఎన్టీఆర్ గారి కొరియోగ్రఫీ చేశారు సాంగ్స్ కి ఎన్టీఆర్ గారే కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమా పెద్ద ఆడకున్న ఎన్టీఆర్ గారు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అయితే చాలా బాగుంటుంది..
3. మంచు విష్ణు
మంచి విష్ణు గారు మోహన్ బాబు గారి కొడుకు లాగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మామూలు మంచు విష్ణు గారిని చాలామంది తక్కువ అంచనా వేస్తారు కానీ మంచు విష్ణు గారు యాక్టర్ గా చాలా సినిమాలో నటించాడు అలాగే ప్రొడ్యూసర్ గా మారి కరెంటు తీగ సింగం 123, మామ మంచు అల్లుడు కంచు సన్నాఫ్ ఇండియా లాంటి సినిమాలను నిర్మించాడు.. అంతే కాకుండా మంచు విష్ణు గారు రైటర్ గా మరి ఒక సినిమాకి స్టోరీ కూడా రాశాడు ఆ మూవీనే “సింగం123” సంపూర్ణేష్ బాబు గారు హీరోగా తీశారు..
ఇది కూడా చూడు మావా👇
Crazy Sentiments of Tollywood Directors
4. డైమండ్ రత్నబాబు గారు
ఈ పేరును మీలో చాలామంది వినుండరు నిజానికి సన్నాఫ్ ఇండియా అనే సినిమాను తీసింది ఈ డైరెక్టర్.. సన్ ఆఫ్ ఇండియా మూవీ గురించి ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దాని డాక్టర్స్ చెప్పారు అందుకే ఇక్కడ ఏం మాట్లాడట్లేదు.ఈ కలకాండం గురించి పక్కకు పెడితే ఈ సినిమాను తీసిన డైరెక్టర్ రత్నబాబు ఒక మంచి మూవీ స్టోరీ రైటర్ అన్న విషయం చాలామందికి తెలియదు రత్న బబు గారికి చాలా టాలెంట్ ఉంది నిజానికి సీమశాస్త్రి.. పిల్ల నువ్వు లేని జీవితం.. ఈడోరకం ఆడోరకం.. పాండవులు పాండవులు తుమ్మెద… సినిమాలకి స్టోరీ రాసింది ఇతనే.. ఇది విన్న తర్వాత డైరెక్టర్ రత్నబాబు గారి మీద ఎంతో కొంత రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది
4. శివాజీ గారు
ఏదో ఒక్క చిన్న ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకుందామని శివాజీ గారు హైదరాబాదుకు వచ్చారు. తర్వాత జెమినీ టీవీలో ఎడిటర్ గా పని చేశాడు.. ఆ తర్వాత బుల్లితెర మీద యాంకర్ గా కూడా పనిచేశాడు. అలా సైడ్ ఆక్టర్ గా కొన్ని రోజులకు హీరోగా కూడా సినిమాలో నటించి నిలదొక్కుకోగలిగాడు. అయితే యాక్టర్ శివాజీ గారు చాలామందికి ఒక యాక్టర్ గానే తెలుసు కానీ శివాజీ గారు పిజ్జా.. జయం.. దిల్.. ఉల్లాసంగా ఉత్సాహంగా.. సంబరం… లాంటి సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పాడు. ఇక్కడ హైలెట్ ఏంటంటే దిల్ సినిమాకి డబ్బింగ్ చెప్పినందుకు నంది అవార్డ్ ఫర్ బెస్ట్ మెయిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డు వచ్చింది.
5. మెహర్ రమేష్ గారు
మెహర్ రమేష్ గారు కన్నడలో మంచి మంచి సూపర్ హిట్స్ తీసినప్పటికీ, తెలుగులోకి వచ్చేసరికి అన్ని ఫ్లాప్ సే తీశాడు.. ఆ విషయాన్ని పక్కకు పెడితే అందరూ హీరోస్ కి ఫ్లాప్ మూవీస్ ఇచ్చిన మెహర్ రమేష్ గారు ప్రభాస్ అన్నకి మాత్రం బిల్లా మూవీతో ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే సినిమాని ఇచ్చాడు అయితే ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుంది నిజానికి ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని మెహర్ రమేష్ గారి రాసాడంట ఇది విన్న తర్వాత చాలామంది నమ్మకపోవచ్చు. కానీ మీరు నమ్మిన నమ్మకున్న ఇదే నిజం Our heros Special Talents ఏదేమైనాప్పటికీ సినిమా రిజల్ట్ పక్కకు పెడితే ఈ సాంగ్ లో ప్రభాస్ అన్న కటౌట్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయి. థాంక్యూ థాంక్యూ మెహర్ రమేష్ మావా థాంక్యూ ఇంతకంటే ఏం చెప్పగలం ఒక ప్రభాస్ అన్న అభిమానిగా…
6.మంచు మనోజ్ గారు
మంచి ఫ్యామిలీ నుండి అందరికీ నచ్చే హీరో మంచు మనోజ్ గారు. సొసైటీలో ఏదైనా ప్రాబ్లం వస్తే అందరికంటే ముందుగా స్పందించి ఆ విషయం మీద మాట్లాడతారు హీరోగా అండ్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తను నటించిన పోటుగాడు సినిమా సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ గారు ఒక్క హీరో గానే కాకుండా ఈ సినిమాకి స్టంట్ మాస్టర్ గా కూడా పనిచేశాడు. మూవీలో యాక్షన్ సీన్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి దానికి రీజన్ మంచి మనోజ్ గారే..
7. రానా దగ్గుపాటి గారు
మన టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లిందంటే అందులో రానా పాత్ర కూడా ఉంది రానా గారు మన టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచడంలో ముందుంటారు యాక్టర్ హీరో గా చాలా సినిమాల్లో నటించాడు అయితే నిజానికి అవెంజర్స్ మూవీ లోని అవెంజర్స్ ఎండ్ గేమ్ లో తానోస్ పాత్రకి తెలుగు లో రానా గారే డబ్బింగ్ చెప్పాడు.. అలాగే సైనికుడు మూవీకి VFX కోఆర్డినేటర్ గా కూడా పనిచేశాడు ఈ సినిమాకి రానా గారికి నంది అవార్డ్ ఫర్ బెస్ట్ విజువల్ కోఆర్డినేటర్ అవార్డు వచ్చింది
8. పవన్ కళ్యాణ్ గారు
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి కోట్లలో అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలానే సినిమాలు తీశాడు అలాగే డైరెక్టర్ గా జానీ అనే సినిమా తీశాడు కానీ పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ మాస్టర్ గా మారి ఒక సినిమాకి పనిచేసాడు అంటే చాలామందికి నమ్మాలనిపించదు. డాడీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు సెండ్ మాస్టర్ గా పనిచేశాడు సరిగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు డాడీ మూవీలో కనిపిస్తారు
9. విజయ్ ఆంటోనీ గారు
విజయ్ ఆంటోని గారు యాక్టర్ గా.. సైడ్ ఆక్టర్ గా.. హీరోగా…అండ్ డైరెక్టర్ గా… సింగర్ గా.. ఇలా అన్ని రకాల పనులు చేస్తాడు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిజానికి విజయ్ ఆంటోని గారు ఇండస్ట్రీలోకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అతనికి మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా అవార్డ్స్ వచ్చాయి
10. నాని గారు
నాని గారు మంచి మంచి సినిమాలోని తీస్తూ సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు హీరో నాని తన కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడన్న విషయం అందరికీ తెలిసిందే.Our heros Special Talents డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల నాని గారికి డైరెక్షన్ గురించి ఎంతో కొంత తెలిసింది. అయితే హాను రాఘవపూడి గారి డైరెక్షన్లో నాని గారు హీరోగా వచ్చిన “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” సూపర్ హిట్ అయ్యింది ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని నాని గారే డైరెక్ట్ చేశారు డైరెక్షన్ గురించి తెలిసి ఉండడంతో నాని గారికి ఇది పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి