Heros Who Have Faced Insults : హీరోలకి జరిగిన అవమానాలు
Heros Who Have Faced Insult ఒక మనిషి జీవితంలో అవమానాలు అనేవి చాలా కామన్. నిజానికి అవి ఉంటేనే లైఫ్ ఇంకా బెటర్ గా ఉంటుంది. అయితే సెలబ్రిటీస్ లైఫ్ లో కూడా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత కొన్ని అవమానాలు జరిగాయి. అవేంటో ఆ హీరోస్ ఎవరో తెలుసుకుందాం
1. ఉపేంద్ర గారు
ఉపేంద్ర గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తను ఏది చేసినా అందరికంటే భిన్నంగా చేస్తాడు. అందుకే తనకి మన సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే తను హీరో అవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఒకరోజు మూవీ షూటింగ్ మధ్యలో ఫుడ్ కోసం ప్లేట్ పట్టుకుని వెళ్తే అక్కడున్న ప్రొడక్షన్ బాయ్ ఫుడ్ లేదు ఏం లేదు పోరా అని అవమానించాడంట. ఇక్కడ హైలెట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత తాను హీరోగా నటించే సినిమాకి తనని అవమానించిన పర్సనల్ ప్రొడక్షన్ బాయ్ గా పనిచేశాడు ఒకప్పుడు నన్ను అవమానించాడు కదా అని ఆ పర్సన్ మీద ఉపేంద్ర గారు తీసుకోలేదు అంట
2. అల్లు అర్జున్
2016 లో జరిగిన సైమా అవార్డ్స్ లో నయనతార గారికి ఒక సినిమాలో నటించినందుకు బెస్ట్ నటి గా అవార్డ్ ఇవ్వడానికి స్టేజి మీద అల్లు అర్జున్ గాని పిలిచారు. కానీ నయనతార గారు అల్లు అర్జున్ కాదని ఆ అవార్డును తన భర్త అయిన విఘ్నేష్ గారి చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది అని చెప్పి విఘ్నేష్ గారిని స్టేజి మీదకు పిలిచింది. ఈ విషయంలో నయనతార గారిని అందరూ తప్పుపట్టారు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆ అవమానాన్ని నవ్వుతో రిసీవ్ చేసుకున్నాడు
Heros Who Don’t Do Other Industry Movies
3. ఆలీ గారు
ఆలీ గారు కమెడియన్ గానే అందరికి తెలుసు. కానీ ఆలీ గారు దాదాపు 52 సినిమాలు హీరోగా నటించాడు అలాగే యాక్టర్ గా 1000 కంటే ఎక్కువ సినిమాలు నటించాడు అయితే ఆలీ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చూస్తూ ఉన్నప్పుడు తనని ఒక మూవీలో తీసుకున్నారు. ఒక్కరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా నిర్మాత ఆలీ గారికి డబ్బులు ఎందుకు ఒక బిర్యానీ పాకెట్ ఇస్తే సరిపోతుంది అని అవమానించారు. దీంతో ఆలీ గారు ఆ నెక్స్ట్ రోజు షూటింగ్ కి వెళ్ళలేదు దీంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ విధంగా తన రివేంజ్ తీర్చుకున్నాడు
4 అడవి శేష్
ఎవరికైనా ఒక మంచి సినిమాతో మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇవ్వాలని ఉంటుంది. అడవి శేష్ గారు అప్పుడప్పుడే సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ టైంలో సొంతం అనే సినిమాలో హీరో క్యారెక్టర్ అని చెప్పి తనని సినిమాలోకి తీసుకున్నారు. రెండు మూడు రోజుల తర్వాత షూటింగ్ అయిపోయింది వెళ్ళిపొమ్మన్నారు అప్పుడు తనకు అర్థమైంది సినిమాలో తనది హీరో క్యారెక్టర్ కాదు అది జస్ట్ ఒక గెస్ట్ రోల్ అని. ఇలా జరిగినందుకు అడివి శేష్ గారు చాలా బాధపడ్డారు దీంతో సొంతం మూవీని ఎప్పటికీ ఒకసారి కూడా చూడలేదు అంట
5. రజినీకాంత్
రజనీకాంత్ గారికి దైవభక్తి ఎక్కువ అని అందరికీ తెలిసిందే శివాజీ మూవీ హిట్ అయిన తర్వాత ఒకరోజు ఒక టెంపుల్ కి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఒక గట్టుమీద కూర్చున్నాడు అప్పుడు రజనీకాంత్ గారు బట్టతలతో ఉండడం వల్ల తనని ఎవరు కూడా గుర్తుపట్టలేదు. అక్కడే ఒక్క ఉన్న మహిళ రజనీకాంత్ గారు బిచ్చగాడు ఏమో అని తన చేతిలో ₹10 పెట్టి వెళ్లిపోయింది. తర్వాత కొద్ది సేపటికి తాను చేసిన తప్పుని తెలుసుకుని రజనీకాంత్ గారికి సారీ చెప్పింది. అయితే మేకప్, విగ్గు లేకుంటే ఇది నా పరిస్థితి అనుకున్న రజినీ కాంత్ గారు అప్పటినుండి ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఏ ఈవెంట్ కి వెళ్లిన మేకప్ లేకుండా తలకి విగ్గు లేకుండా వెళ్తాడు.
6. సిద్దు జొన్నలగడ్డ
ఇప్పుడంటే సిద్దు జొన్నలగడ్డలకి యూత్లో మంచి క్రేజీ ఉంది కానీ కెరీర్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు తను ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 13 సంవత్సరాల కి తనకి ఒక గుర్తింపు వచ్చింది అయితే మొదట్లో నేను హీరో అవుతానని అన్నప్పుడు ముఖం మీద మచ్చలేసుకొని హీరో అయిపోతావా?? అని చాలామంది ఇన్సల్ట్ చేశారంట కానీ వాటిని పట్టించుకోకుండా సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇప్పుడు తన సినిమా కోసం ఆడియోన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు