Heroes Thoughts Before 1st Movie : సినిమాల్లోకి వచ్చే ముందు హీరోల ఆలోచనలు..
సినిమాల్లోకి కొంతమంది మనీ కోసం వస్తారు కొంతమంది పేరు కోసం వస్తారు. మరి కొంతమంది మనీ పేరు కాదు, తనను తాను నిరూపించుకోవడానికి వస్తారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు వాళ్లకి ఎన్నో కలలు ఆశయాలు ఉంటాయి. వాళ్ల సినీ జీవితం గురించి ఎన్నో ఊహించుకుంటారు. మంచి మంచి సినిమాలు తీయాలని. నమ్మకంగా ఉండే కొంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న చాలు అని. అసలు నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారా??
సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఇండస్ట్రీలోనే ఉండాలి అని మరికొందరు,ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో సినీ కెరీర్ స్టార్ట్ చేస్తారు అందులో కొందరు సక్సెస్ అవుతారు కొందరు కారు. అయితే ఇప్పుడున్న కొంతమంది హీరోస్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఏమనుకున్నారో ఎలాంటి ఆలోచనలు చేశారో తెలుసుకుందాం..
1. అల్లు అర్జున్
అల్లు అర్జున్ గారి స్టడీ అయిపోయాక గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్ అయిన అల్లు అర్జున్ గారికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అల్లు అర్జున్ గారు ముందు నుండి స్టడీలో లాస్ట్ ఉండేవాడు లైఫ్ లో చాలా వరకు అన్ని ఫెయిల్యూర్ సే ఉండేవి. అసలు అల్లు అర్జున్ ఎలా బతుకుతాడు అని ఇంట్లో అందరికీ ఒక భయం ఉండేది. గంగోత్రి సినిమా తర్వాత దాదాపు ఒక సంవత్సరం ఖాళీగానే ఉన్నాడు. ఆ టైంలో తనను పెట్టే సినిమా తీయడానికి ఎవరు సాహసం చేయలేదు. అప్పుడు అల్లు అర్జున్ స్టడీలో ఎలాగూ ఫెయిల్యూర్ చివరికి సినిమాల్లో కూడా ఫెయిల్యూర్ ఏనా అని అనుకున్నాడు, తర్వాత కొన్ని రోజులకు ఆర్య సినిమా వచ్చింది అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు
2. ప్రభాస్
ప్రభాస్ గారు వాళ్ళ పెద్ద నాన్న కృష్ణం రాజు గారి బలవంతమేరకు సినిమాల్లోకి వచ్చాడు ఈశ్వర్ మూవీతో రీజినల్ హీరోగా స్టార్ట్ అయిన తన కెరీర్ ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ వరకు వచ్చింది. మామూలు ఆడియన్స్ కి హీరోస్ అంటే ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువ మంది ఈ హీరోస్ కి ఇష్టమైన హీరో డార్లింగ్ ప్రభాస్. అయితే ప్రభాస్ అన్న ఈశ్వర్ మూవీ టైం లో తనకి “ఒక ఫ్యాన్ ఉన్న సరిపోద్ది అని అనుకున్నాడంట” కానీ ఇప్పుడు నేషనల్ వైడ్ గా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు
3. నాని
నాని గారి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. మంచి మంచి స్టోరీ సెలక్షన్ తో వరసగా సూపర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నాడు. నిజానికి నాని ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. నాని హీరో అవడం అనేది అనుకోకుండా జరిగిన సంఘటన. అయితే నాని గారు హీరోగా నటించడానికి ముందు “అయినా నా మూవీస్ ని ఎవరు చూస్తారు నన్ను హీరోగా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా?? మనకంత సీన్ ఉందా మనల్ని పెట్టి సినిమా తీసి అంత ధైర్యం ప్రొడ్యూసర్స్ చేస్తారా??” లాంటి చాలా ఇన్ సెక్యూర్ ఆలోచనలతో ఇండస్ట్రీకి వచ్చాడు . కానీ ఇప్పుడు అలా భయపడుతూ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడు
4. సందీప్ కిషన్
స్నేహ గీతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్ గారు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాలు కూడా యూనిక్ గా ఉంటాయి. బాలీవుడ్ లో కూడా తనకి మంచి మార్కెట్ ఉంది. అయితే సందీప్ కిషన్ గారు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు “అన్ని మంచి మంచి సినిమాలు తీయాలి ఒక్క ఫ్లాప్ కూడా కెరీర్ లో ఉండకూడదు అని అనుకున్నాడంట”