Hero Vs Director Controversies : ఈ హీరో & డైరెక్టర్ సచ్చిన కలిసి సినిమాలు చెయ్యరు
మన టాలీవుడ్ లో బెస్ట్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి రాజమౌళి ఎన్టీఆర్.. బోయపాటి శ్రీను బాలయ్య.. రవితేజ గోపీచంద్ మాలినేని… అల్లు అర్జున్ సుకుమార్… వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.Hero Vs Director Controversies వీళ్ళు ఒకరితో ఒక్కరు చాలా కంఫర్ట్ గా పని చేస్తారు. వీళ్లు తమ కెరీర్లో వీలైనన్ని సినిమాలో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ కొంతమంది హీరోయిన్ డైరెక్టర్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నారు. వాళ్ల మధ్యలో పచ్చ గడ్డి ఇస్తే బగ్గుమని మండుతుంది. లాస్ట్ కి ప్రభాస్ & రాదే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు కలిసి ఇంకో సినిమా తీస్తారు కావచ్చు కానీ వీళ్ళు మాత్రం ఈ జన్మలో కలిసి సినిమా తీసే చాన్స్ లేదు. మామూలుగా హీరోకి డైరెక్టర్ వీలు కాక సినిమా తీయని వాళ్ళు చాలామంది ఉన్నారు..Hero Vs Director Controversies కానీ ఈ ఇద్దరు ఎంత సెట్ అయినా సరే ఖాళీగా అయిన ఉంటారు కావచ్చు కానీ కలిసి సినిమా మరీ ఆ హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం
సాయి రాజేష్ & విశ్వక్సేన్
కొబ్బరిమట్ట హృదయ కాలేయం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ గారు బేబీ అనే ఒక సెన్సేషనల్ మూవీ తీసి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కలర్ ఫోటో స్టోరిని రాసింది కూడా తానే. అయితే నిజానికి బేబీ మూవీ ని విశ్వక్ సేన్ గారితో తీద్దామని అనుకుని తనకి స్టోరీ చెప్పడానికి వెళ్తే కనీసం స్టోరీ వినకుండా వాడితో ఎవడు మూవీస్ చేస్తాడు. అన్నట్టుగా మాట్లాడాలంట. ఈ విషయం మీద పెద్ద కాంట్రవర్సే జరిగింది. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే దానికి విశ్వాక్ సేన్ రెస్పాండ్ అవుతూ “సినిమా చేయాలనే ఉద్దేశం లేదని వట్టిగా డైరెక్టర్ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేకనే అలా చేశానని” ఒక సందర్భంలో చెప్పాడు
కొరటాల శివ & చిరంజీవి
కొరటాల శివ & మెగాస్టార్ కాంబినేషన్లో ఆచార్య సినిమా వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే సినిమా రిజల్ట్ ఏంటో కూడా తెలిసిందే. ఈ సినిమా చూసిన చాలామంది అసలు ఇది కొరటాల గారి శివ సినిమా నేనా అని అనుకున్నాను. సినిమా తర్వాత కొరటాల శివ గారు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సినిమా మేకింగ్ లో చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వడంతోనే సినిమా ఫ్లాప్ అయిందని సమాచారం.అయితే సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి గారు సినిమా గురించి వెటకారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలిస్తే మళ్లీ చిరంజీవి అండ్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రావడం అంటే గగనమనే చెప్పాలి.
ఇది కూడా చూడు మావా👇
మెహర్ రమేష్ & ఎన్టీఆర్
మెహర్ రమేష్ గారికి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన ఏకైక హీరో ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కంత్రి అండ్ శక్తి లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అందులో శక్తి మూవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమా తర్వాత ఈ సినిమా నిర్మాత దాదాపు పది సంవత్సరాలు కనుమరుగయ్యాడు. మామూలు మెహర్ రమేష్ గారికి ఒకసారి ఛాన్స్ ఇవ్వడమే మిరాకిల్ అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. మళ్లీ వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఈ జన్మలో రాకపోవచ్చు.
నాగచైతన్య అండ్ పరశురాం
నాగచైతన్య తన 20 సినిమాని గీతగోవిందం డైరెక్టర్ పరుశురాం గారితో చేస్తున్నాడని అప్పట్లో అనౌన్స్ చేశారు. అంతా సెట్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేద్దామని టైం లో పరశురాం గారు. ఈ సినిమాని పక్కకు పెట్టేసి మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట సినిమా తీశాడు. దీనివల్ల నాగచైతన్య గారి విలువైన టైం వేస్ట్ అయింది. మామూలుగా నాగచైతన్య గారు ఎంత సైలెంట్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ తన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ గురించి నెగటివ్ గా మాట్లాడాడు. అలాంటిది వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాకి పనిచేయడం జరగకపోవచ్చు
శంకర్ & రామ్ చరణ్
అంతా బాగుంటే ఈపాటికి రామ్ చరణ్ హీరో మూవీ రిలీజ్ అయ్యేది. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గారికి నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. తన యాక్టింగ్ తో దేశం మొత్తం ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అలాంటి విలువైన టైంలో శంకర్ గారితో తన 16వ సినిమాని ఒప్పుకుంటే శంకర్ గారు మాత్రం ఈ సినిమాని సగం కంప్లీట్ మధ్యలోనే ఆపేసి కమల్ హాసన్ గారితో ఇండియన్ 2 సినిమాని తీస్తున్నాడు. కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడు ఒక హీరో సినిమాలు చేయకపోవడం చాలా బాధాకరం. శంకర్ గారు రామ్ చరణ్ అన్న విలువైన టైమంతా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. మళ్ళీ రామ్ చరణ్ గారు శంకర్ గారి సినిమాల్లో హీరోగా నటించకపోవచ్చు
విశ్వక్సేన్ అండ్ అర్జున్
అర్జున్ గారు డైరెక్టర్ గా వాళ్ళ కూతుర్ని హీరోయిన్గా పరిచయం చేస్తూ విశ్వక్సేన్ గారితో ఒక సినిమాని అనౌన్స్ చేశారు అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ సినిమా షూటింగ్ ను విశ్వక్సేన్ గారు చాలా సార్లు పోస్ట్ పోన్ చేశాడంట. తర్వాత కొన్ని రోజులకి ఆ మూవీలో నుండి బయటకు వచ్చేసాడు. ఈ విషయం మీద అప్పట్లో విశ్వక్సేన్ అర్జున్ మధ్యలో చిన్న కాంట్రవర్సీ అయింది. మామూలుగా అర్జున్ గారు ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుండి ఇలాంటి కాంట్రవర్సీస్ కి చాలా దూరంగా ఉంటున్నాడు. తన 34 ఏళ్ల సినీ కెరీర్లో ఇలా జరగడం మొదటిసారి. ఇంత జరిగాక కూడా వీళ్ళిద్దరూ ఒక సినిమాలో కలిసి పనిచేయడం అస్సలు జరగదు.
చిరంజీవి & మెహర్ రమేష్
నిజానికి మెహర్ రమేష్ గారు వరసకి చిరంజీవి గారికి కజిన్ అవుతాడు. షాడో మూవీ తర్వాత దాదాపు పది సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యాను. తర్వాత మళ్ళీ భోళా శంకర్ సినిమాతో ఇండస్ట్రీలోకి రియల్ ఇచ్చాడు. అయితే చిరంజీవి గారు ఈ సినిమాలో మెహర్ రమేష్ గారికి మనొడే కదా అని ఛాన్స్ ఇచ్చినట్టు ఉన్నాడు. కానీ మెహర్ రమేష్ గారు చిరంజీవి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి గారు అదే సంవత్సరం భోళా శంకర్ సినిమాతో పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. మళ్లీ వీళ్ళిద్దరూ ఒక సినిమా కోసం కలిసి పని చేయడం కొంచెం కష్టం అనే చెప్పాలి