Don’t Mess With Sandeep Reddy -అందుకే సందీప్ రెడ్డి వంగని గెలకొద్దు
యానిమల్ మూవీ రిలీజ్ చాలా రోజులైనా అప్పటికి సినిమా గురించి ఇంకా కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. సినిమా మీద ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉన్నారు సినిమా కొంతమందికి నచ్చింది కొంతమందికి అస్సలు నచ్చలేదు.ఎంతమంది ఎన్ని విధాలుగా నెగటివ్ కామెంట్ చేసినా ఇప్పటికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 900 కోట్లు కలెక్ట్ చేసింది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది
అయితే రీసెంట్ జావేద్ అక్తర్ అనే హిందీ సాంగ్ రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ ఎనిమల్ మూవీ మీద నెగటివ్ కామెంట్ చేశాడు ”సినిమాలో ఒక పురుషుడు అమ్మాయిని తన షూ నాకమని చెప్తాడు అలాగే అమ్మాయిని కొడతాడు అలాంటి సినిమా సూపర్ హిట్ అవడం చాలా బాధాకరం ఇలాంటి సినిమాలు తీయాలి ఎలాంటి సినిమాలు తీయకూడదు అని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి కన్నా ప్రేక్షకులకే ఎలాంటి సినిమాలు చూడాలి అనే బాధ్యత ఎక్కువ ఉంటుంది అని ఇన్ డైరెక్ట్ గా ఎనిమల్ మూవీ మీద కామెంట్ చేశాడు. ఇతను ఎదో నార్మల్ పర్సన్ కాదు. జావేద్ అక్తర్ గారికి ఇప్పటికే ఐదు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అలాగే భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారాలైన పద్మశ్రీ పద్మభూషణ్ కూడా ఇచ్చారు. అయినాప్పటికీ తన సినిమా మీద నెగిటివ్ కామెంట్ చేసేసరికి సందీప్ రెడ్డి వంగ గారికి బాగా మండింది. దీంతో తాను కూడా రివర్స్ కామెంట్ చేశాడు నిజానికి మిర్జాపూర్ వెబ్ సిరీస్ జావేద్ అక్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్ నిర్మించాడు మిర్జాపూర్ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే ఇండియాలో ఎక్కడ లేని బూతులు ఈ సినిమాలోనే ఉంటాయి నువ్వు నా గురించి నా సినిమా గురించి మాట్లాడే ముందు నీ కొడుకు తీసిన మిర్జాపూర్ ఒకసారి చూడు తర్వాత మాట్లాడు అన్నట్టుగా రిప్లై ఇచ్చాడు
సందీప్ రెడ్డి వంగ ప్రతి సినిమాకి ఏదో ఒక కాంట్రవర్సీ చాలా కామన్ దీనికి తాను సినిమా తీసే విధానమే కారణం. తనికి సినిమా తీశామా కలెక్షన్స్ సంపాదించామా అన్నట్టుగా కాకుండా సినిమా తీసి పది సంవత్సరాలైనా తన సినిమా గురించి మాట్లాడాలి అన్నట్టుగా ఉంటుంది అయితే మాట్లాడుకునే విషయాల్లో చెడు విషయాలు కూడా ఉంటాయి సినిమాలో ఉన్న మంచి విషయాలు కాకుండా కేవలం చెడు విషయాల గురించి మాట్లాడను సందీప్ రెడ్డి వంగ కి నచ్చట్లేదు నిత్యమీనన్ గారు కూడా ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్ చేశారు అయినా ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ పాజిటివ్ గానే తీసుకున్నాడు. కరెక్ట్ గా ఉండే పర్సన్స్ తన సినిమాల మీద కామెంట్ చేస్తే పాజిటివ్ అనే తీసుకుంటున్నాను కానీ ఆల్రెడీ తన వెనుక ఏదో ఒక తప్పు పెట్టుకొని తన సినిమాలను కామెంట్స్ చేస్తే మాత్రం గట్టిగానే ఇచ్చి పడేస్తున్నాడు