Different Movie Tittles And Their Meaning : ఈ సినిమా పేర్ల అర్థం తెలుసా??
సినిమా పేరు తోనే సినిమాలో స్టోరీ ఏం ఉండబోతుందో డైరెక్టర్ సినిమాతో ఏం చెప్పబోతున్నాడు సగం వరకు అర్థం చేసుకోవచ్చు. అందుకే సినిమాకి ఒక మంచి టైటిల్ అనేది చాలా అవసరం. అలాగే టైటిల్ విషయంలో మూవీ టీం కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రజెంట్ సినిమా తీసే విధానం మారుతుంది. అలాగే సినిమాకి పేరు పెట్టే విధానం కూడా చాలా మారింది ఒకప్పటిలా కామన్ టైటిల్స్ కాకుండా ఇప్పుడు చాలా కొత్త టైటిల్స్ ను ఎవరికి తెలియని టైటిల్స్ ను సినిమా పేర్లుగా పెడుతున్నారు అలాంటి కొన్ని సినిమాలు ఏంటో వాటి అర్థమేమిటో తెలుసుకుందాం
1. ఖలేజా
మహేష్ బాబు గారు హీరోగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మాస్టర్ పీస్ అని చెప్పచ్చు అయితే ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉంటుంది మామూలుగా కలిసి అంటే ధైర్యం లేదా గుండెని అర్థం వస్తుంది అలాగే కలేజా పేరును సంస్కృతంతో కంపేర్ చేస్తే ఖ అంటే 5, లే అంటే 3, జా అంటే 4, సినిమాలో మహేష్ బాబు గారు ఫాలి అనే గ్రామంలో టోటల్గా 534 మంది ప్రాణాలను కాపాడాడు. దానికి సింబాలిక్ గా సినిమాకు ఖలేజా పేరు పెట్టారంట
2. ఆరెంజ్
ఈ సినిమా చాలా బాగున్నప్పటికీ మన వాళ్లు ఎందుకో సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు. ఈ సినిమా వల్ల నాగబాబు గారు టోటల్గా నష్టపోయారు. ఆ విషయాన్ని పక్కకు పెడితే మామూలుగా ఈ సినిమా టైటిల్ చూశాక చాలా మంది ఆరెంజ్ అంటే ఓక్క రేంజ్ లో అని అనుకున్నారు కానీ నిజానికి మార్నింగ్ పూట ఆకాశంలో ఆరెంజ్ కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మధ్యాహ్న వచ్చేసరికి కొంచెం కొంచెం తగ్గిపోతుంది మళ్లీ సాయంత్రానికి పెరుగుతుంది ఇలానే ప్రేమ కూడా తగ్గిన ప్రతిసారి పెరగాలి అని అర్థం వచ్చేలా ఆరెంజ్ అని పేరు పెట్టాం అని సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు
Heros Who Don’t Do Other Industry Movies
3. కాంగువ
శౌర్యం శంఖం దరువు లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శివ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు సూర్య మెయిన్ లీడ్ గా వస్తున్న ఈ సినిమాకి ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నారు. ఈ సినిమాలో సూర్య గారు 6 పాత్రలో కనిపించబోతున్నారంట. అయితే ఈ సినిమా టైటిల్ అనేది చాలా కొత్తగా ఉంది కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి అలాగే పరక్రమవంతుడు అని అర్థం వస్తుంది
4.3 మూవీ
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన స్టేటస్ ని వాట్సాప్ లో ఎవరో ఒకరు రోజు పెడుతూనే ఉంటారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో ఒక డిసార్డర్ తో బాధపడుతుంటాడు దానికి మెయిన్ గా త్రీ సింటమ్స్ ఉంటాయి 1.Over Happiness 2.Over Sadness 3. Overanger దీన్ని దృష్టిలో ఉంచుకొని మూవీ టీం సినిమాకి 3 అని పేరు పెట్టారని సమాచారం ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఈ సినిమాని ధనుష్ వాళ్ళ వైఫ్ ఐశ్వర్య రజనీకాంత్ గారు డైరెక్ట్ చేశారు
5. సలార్
ప్రభాస్ అన్న కేరీర్ లో ఏదైనా మోస్ట్ ఆంటీస్పెటెడ్ మూవీ ఉందంటే అది సలార్ అనే చెప్పాలి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా ప్రభాస్ అన్న హీరోగా సలార్ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుండి అసలు ఈ సినిమా అర్థమేంటని చాలామంది సెర్చ్ చేస్తున్నారు. నిజానికి సలార్ అనేది ఒక ఉర్దూ పదం సలార్ అంటే ఉర్దూలో సమర్థవంతమైన పాలకుడు అని అర్థం వస్తుంది
6. జిగర్ తండా డబుల్ ఎక్స్
సుబ్బరాజు డైరెక్షన్లో రాఘవ లారెన్స్ మెయిన్ లీడ్ గా వచ్చిన ఈ సినిమా 2023 లో వచ్చిన ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మొదటిసారి రాఘవ లారెన్స్ గారు Sj సూర్య గారి యాక్టింగ్ ను డామినేట్ చేశాడు అయితే జిగర్తాండ అనేది మదురై లో ఒక కూల్ డ్రింక్ పేరు అంటా
7. తండెల్
కార్తికేయ 2 మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని చందు మండేటి తండెల్ మూవీతో వస్తున్నాడు. మూవీలో నాగచైతన్య అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అయితే ఇది సముద్ర తీరాన ఉండే మత్స్యకారులకు సంబంధించిన కథ. నిజానికి తండాలంటే చేపలు పట్టే బృందానికి నాయకుడు అని అర్థం వస్తుంది
8. డంకి
అసలు ఫ్లాప్ అంటే ఎలా ఉంటుందో తెలియని బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీ, 2023 లో రెండు 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చిన హీరో షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో డంకి సినిమా వచ్చింది 120 కోట్లతో తిరిగెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అయితే డాంకీ అంటే చాలామంది గాడిదనే అనుకుంటారు కానీ డంకీ అనేది ఒక పంజాబీ పదం డాంకీ అంటే అక్రమంగా దేశ సరిహద్దులను దాటడం అని అర్థం వస్తుంది
9.తంగలన్
కబాలి ఫ్రేమ్ డైరెక్టర్ పా రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ అండ్ మాళవిక మోహనన్ మెయిన్ లీడ్స్ గా వస్తున్న మూవీ తంగలన్. సినిమాకి అరౌండ్ గా 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ సినిమా పేరు కూడా చాలా కొత్తగా ఉంది దాని మీనింగ్ చాలా మందికి తెలియదు. నిజానికి తంగలేనంటే తమిళనాడులోని ఒక పేరు అంటా
10.అయాలన్
ఒకప్పుడు ధనుష్ గారి సినిమాలో సైడ్ ఆక్టర్ గా నటించిన శివ కార్తికేయన్ గారు ఇప్పుడు ఏకంగా ధనుష్ గారి కెప్టెన్ మిల్లర్ సినిమాకి తన అయాలన్ సినిమాని పోటీగా రిలీజ్ చేశాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఒక ఏలియన్ వేరే గ్రహం నుండి భూమి మీదికి వస్తాడు. అయితే నిజానికి ఆయాలను అంటే పొరుగువాడని అర్థం వస్తుంది