Actors who Failed As politicians : రాజకీయ పార్టీలను పెట్టి ఫెయిల్ అయిన సెలబ్రిటీస్

Actors who Failed As politicians : రాజకీయ పార్టీలను పెట్టి ఫెయిల్ అయిన సెలబ్రిటీస్

 

మనం ఇప్పటివరకు చాలా రాజకీయ పార్టీలను చాలామంది రాజకీయ నాయకులని చూసాం.. ప్రభుత్వంతో పోరాడడానికి ప్రజల్లో చైతన్య నింపడానికి ప్రజల అవసరాలు తీర్చడానికి రాజకీయ పార్టీలను ప్రారంభించారు..Actors who Failed As politicians ఒక పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత తొందరగా అది రాజకీయంగా గెలవడం అనేది సాధ్యం కాకపోవచ్చు.. దానికి సంవత్సరం టైం పట్టిచ్చు లేదా పది సంవత్సరాల టైం కూడా పట్టొచ్చు.. 

Actors who Failed As politicians
Actors who Failed As politicians

 

కొన్ని సార్లు ఎంత ట్రై చేసినా అధికారంలోకి రాకపోవచ్చు.. ఈ విషయాలు పక్కకు పెడితే కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా సొంతంగా రాజకీయ పార్టీలను స్టార్ట్ చేశారు.. కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలన్నా ఉద్దేశంతో ప్రారంభిస్తే మరికొంతమంది ఇంకొకరి మీద కోపంతో రాజకీయ పార్టీలను స్టార్ట్ చేశారు.. అందులో సక్సెస్ అయిన వాళ్ళ కంటే ఫెయిల్ అయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి మనం రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిన సెలబ్రెటీస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 

1. ప్రజారాజ్యం పార్టీ

ఇండియన్ సినిమాలో చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని స్థాయి వేరు, అతని స్థానం వేరు.. సినిమాలు ఇచ్చిన విజయం ప్రజలు ఇచ్చిన భరోసా ప్రజల సమస్యల మీద పోరాడన్న తన తపన అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ మీద కోపం ఇలా అన్నీ కలిపి చిరంజీవి గారిన  ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేసేలా చేశాయి..Actors who Failed As politicians ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడు చిరంజీవి గారు 2008 లో ప్రజా రాజ్యం పార్టీని స్టార్ట్ చేశాడు..

ఈ పార్టీకి జరిగిన మొదటి బహిరంగ సభలో ఏకంగా 10 లక్షల మంది హాజరయ్యారు 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేస్తే 18 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది 32 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో వచ్చింది.. మునస్థానంలో కాంగ్రెస్ ఉంటే సెకండ్ స్థానంలో టిడిపి ఉంది తాడు స్థానంలో 18 స్థానాలతో ప్రజారాజ్యం పార్టీ మూడో స్థానంలో వచ్చింది.. పాటిని స్థాపించిన 8 9 నెలల్లోనే 18 స్థానాల్లో గెలవడం అంటే చాలా పెద్ద విషయం.. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం.. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరగడం.. తండ్రి చనిపోయిన తర్వాత జగన్ గారు కొత్త పార్టీని స్థాపించే ఉద్దేశం ఉండటం.. అలాగే రాజకీయాల్లో నిలవాలంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలని తెలియడం..

దీంతోపాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నుండి విలీనం కావాలని ఒత్తిడి రావడం.. ఇలాంటి చాలా కారణాలవల్ల 2011లో సోనియాగాంధీ సమావేశమైన తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు అలా విలీనం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తనకి కేంద్ర స్థాయిలో ఒక మంత్రి స్థానాన్ని ఇచ్చింది.. నిజానికి చిరంజీవి గారు అదే ప్రజారాజ్యం పార్టీని వెనుకడు వేయకుండా నడిపిస్తే ఈపాటికి ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లో ఉండేది చిరంజీవి గారు సీఎం అయ్యేవాడు.. కానీ అలా జరగలేదు దీంతో రెండు సంవత్సరాలకే ప్రజారాజ్యం పార్టీ కథ ముగిసింది..

 

 

2. తల్లి తెలంగాణ పార్టీ

ఒకప్పుడు విజయ శాంతి గారికి స్టార్ హీరోస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. తను ఎంత స్థాయికి వెళ్ళినప్పటికీ తను తెలంగాణకు చెందిన అమ్మాయి కావడంతో  తెలంగాణ గురించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడేది. ఒకానొక సందర్భంలో తెలంగాణ ప్రజలకి సేవ చేయాలని తెలంగాణ ప్రజల్లో చైతన్య నింపాలని ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా “తల్లి తెలంగాణ” అనే ఒక పార్టీని స్థాపించింది.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ పార్టీ ప్రయత్నించింది అయితే అదే టైంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ చాలా ఫామ్ లో ఉంది ప్రత్యేక రాష్ట్రం కోసం రెండు పార్టీలు వేరువేరుగా పోరాడడం ఎందుకని కోదండ రాము గారి సమక్షంలో తల్లి తెలంగాణ పార్టీని టిఆర్ఎస్ లో కలిపింది….

ఇది కూడా చూడు మావా..👇

Crazy Sentiments of Tollywood Directors

 

3.DMDK పార్టీ

తమిళ్ సినిమాలో మంచి పేరున్న యాక్టర్ విజయ్ కాంత్ గారు హీరోగా చాలా సినిమాలు నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి DMDK (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) 2006 లో ఏ పార్టీతో పొత్తు లేకుండా 234 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక స్థానం మాత్రమే గెలిసింది అలాగే 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ ఒక్క ప్లేస్ లో కూడా గెలవలేదు. 2014 NDA కూటమి మద్దతుతో మళ్లీ పోటీ చేస్తే డిఎండికే పార్టీకి 14 సీట్స్ వచ్చాయి 2021 మళ్లీ ఎలక్షన్స్ లో పాల్గొంటే 60 స్థానాల్లో ఓడిపోయింది. ఈ మధ్యనే విజయ్ కాంత్ గారు పార్టీ కార్యకర్తలను అభిమానులను వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోయాడు..

 

4. జనసేన పార్టీ

సినిమాల్లో తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు.. జనసేన పార్టీని 2014లో స్టార్ట్ చేశారు ఇప్పటికీ దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కానీ ప్రజల నుండి సరైన మద్దతు రావడం లేదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన మీద చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు అనారని మాటలు అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి వేరే వాళ్ళు తిడితే పడాల్సిన అవసరం లేదు.. తను సినిమాలు చేసుకుంటూ వందల కోట్లు సంపాదించవచ్చు..

కానీ ప్రజలకి న్యాయం చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో తను రాజకీయాల్లోకి వచ్చాడు.. 2014లో ప్రత్యేకంగా ఎన్నికల్లో పాల్గొనకుండా వేరే పార్టీలకి మద్దతు ఇచ్చారు 2019లో ఎన్నికల్లో  పాల్గొంటే కేవలం ఒక సీటు మాత్రమే వచ్చింది.. అయినా ఇప్పటికీ వెన్ కార్డు వెయ్యకుండా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల కోసం తనతో అయిన సహాయం చేస్తున్నాడు..Actors who Failed As politicians ఈసారి టిడిపి తో కలిపి ఎన్నికల్లో పాల్గొంటున్నాడు కనీసం ఈసారైనా ఒక మంచి నాయకుడిని అసెంబ్లీకి పంపిస్తారో లేదో చూడాలి.

 

5. మక్కల్ నిధి మయం

భారతదేశ సినీ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన కమలహాసన్ గారు కూడా మక్కల్ నిధి మయ్యo అనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు అలాగే 2021 లో జరిగిన తమిళనాడు అండ్ పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కూడా ఒక స్థానంలో గెలవలేకపోయింది కమలహాసన్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తమిళనాడులో అప్పటికే రాజకీయాల్లో ఉన్న పెద్ద పెద్ద పార్టీల వల్ల ఈపాటికి తగినంత గుర్తింపు అయితే రావట్లేదు…

 

6.అన్నా తెలుగుదేశం పార్టీ

తండ్రిగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కేవలం 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది పార్టీ స్టార్ట్ చేసినప్పుడు రాష్ట్రాల్లో ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రారంభించిన యాత్రలో నందమూరి హరికృష్ణ గారు కీలకపాత్ర పోషించారు చైతన్య రథ అనే వాహనానికి తనే డ్రైవర్ గా ఉన్నాడు.. ఈ వాహనంతో ఎన్టీఆర్ గారు అలాగే హరికృష్ణ గారు  కొన్నివేల కిలోమీటర్లు తిరిగారు.. నందమూరి హరికృష్ణ గారే నాన్న గారితో యాత్రలో తిరిగే టైం లో హరికృష్ణ గారికి రాజకీయాలంటే అంటే ఏంటో తెలిసింది.. చాలామంది రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది.. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి చేతుల్లోకి వెళ్లిపోవడంతో.. తర్వాత హరికృష్ణ గారు సొంతంగా అన్న తెలుగుదేశం పార్టీని హరికృష్ణ స్టార్ట్ చేశారు. తర్వాత శాసనసభ ఎన్నికల్లో పాల్గొంటే ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు పార్టీకి కూడా ప్రజల నుండి పెద్ద మద్దతు లభించలేదు.. తర్వాత కొన్ని సంవత్సరాలకి అన్న తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేశాడు…

 

 

 

Leave a comment