Actors Who Earn Money Without Movies : వీళ్ళు మూవీస్ తీయకుండా డబ్బు సంపాదిస్తారు
సినిమాలే చాలామందికి జీవనాధారం. సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. అయితే సినిమాల్లోకి కొంతమంది ఫ్యాషన్ తో వస్తారు ఇంకా కొంతమంది తమని నిరూపించుకోవడానికి వస్తారు. కొందరు అనుకోకుండా కూడా రావాల్సి వస్తుంది. ఏదేమైనా ఫైనల్ గా అందరికీ కావలసింది డబ్బే. మామూలుగా సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తేనే మనీ వస్తుంది కానీ కొంతమంది సెలబ్రిటీస్ మనీ సంపాదించడానికి ప్రత్యేకంగా సినిమాలు తీయాల్సిన అవసరం లేదు.Actors Who Earn Money Without Movies వాళ్లు సినిమాలు తీయకుండా కూడా మని సంపాదించుకోగలరు మరి వాళ్ళు ఎవరో తెలుసుకుందాం
1. త్రివిక్రమ్ గారు
రాజమౌళి సుకుమార్ గారి తర్వాత తెలుగులో అన్న పేరున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన ఫస్ట్ మూవీ తోనే ఇండస్ట్రీస్ కొట్టాడు. ఒక రైటర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన త్రివిక్రమ్ గారు. మామూలుగా ఒక సినిమాను డైరెక్ట్ చేస్తే 15 నుండి 20 కోట్ల వరకు తీసుకుంటాడు. నిజానికి త్రివిక్రమ్ గారు డబ్బు సంపాదించడానికి ప్రత్యేకంగా ఒక సినిమాని డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ & స్క్రీన్ గురించి అందరికీ తెలిసిందే. వేరే సినిమాలకు స్టోరీ గానీ డైలాగ్స్ గాని స్క్రీన్ ప్లే రాసి కూడా కోట్లు సంపాదించగలరు. BRO & భీమ్లా నాయక్ మూవీస్ కి డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాసినందుకు పెద్ద మొత్తమే రెమ్యూనరేషన్ గా అందుకున్నాడు.Actors Who Earn Money Without Movies అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత ఒక సంవత్సరం కాలం వరకు ఏ సినిమా తీయని త్రివిక్రమ్ గారు వేరే సినిమాలకు పనిచేసి 20-30 కోట్లు సంపాదించాడంట
2. హనీ రోజ్ గారు
వీర సింహారెడ్డి మూవీలో నటించిన హనీ రోజ్ గారు మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించట్లేదు. తన సొంత ఇండస్ట్రీ అయిన మలయాళంలో కూడా తనకి అనుకున్న ఆఫర్స్ రావట్లేదు. ప్రజెంట్ తాను సినిమాలో కంటే ప్రమోషన్స్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. తాను చాలా రకాల బ్రాండ్ ప్రమోషన్స్ ని ఈవెంట్స్ ని చేస్తూ సినిమాల్లో కంటే ఎక్కువగానే సంపాదిస్తుంది.
ఇది కూడా చూడు మావా👇
Story Wrote for One But Film With Another
3. మహేష్ బాబు గారు
మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక సినిమా దాదాపు 50 కోట్ల వరకు తీసుకుంటాడు. 30 కంటే ఎక్కువ బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేస్తాడు. నిజానికి బ్రాండ్ ప్రమోషన్స్ లో నుండి సినిమాల్లో కంటే ఎక్కువ సంపాదించవచ్చు. అలాగే తన కూతురు సితార గారు కూడా తన మొదటి జువెలరీ ప్రమోషన్స్ తోనే ఏకంగా ఒక కోటి సంపాదించింది. మహేష్ బాబు గారికి సొంతంగా AMB థియేటర్స్ కూడా ఉన్నాయి అలాగే GMB ( Gattamaneni Mahesh Babu Entertainment) ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి శ్రీమంతుడు సరిలేరు నీకెవ్వరు.. సర్కారు వారి పాట.. మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు (Co Producer). ఒకవేళ మహేష్ బాబు గారు సినిమాలు ఆపేసిన ఆడ్ ప్రమోషన్స్ నుండి సొంత థియేటర్స్ నుండి అలాగే ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఈజీగా ఒక మంత్ రెండు మూడు కోట్లు సంపాదించగలడు
4. నాగార్జున గారు
మన టాలీవుడ్ లో రిచేస్ట్ యాక్టర్ నాగార్జన గారు అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 3000 కోట్లు Net Worth తో టాలీవుడ్ లో టాప్ లో ఉన్నాడు. నాగార్జున గారు మామూలు ఒక సినిమాకి 10 నుండి 20 కోట్ల వరకు తీసుకుంటాడు. అన్నపూర్ణ స్టూడియోస్ అనే ఒక్క పెద్ద ప్రొడక్షన్ అవుతుంది. నాగార్జున గారి దగ్గర ఇంత డబ్బు ఉందంటే దానికి ప్రధాన కారణం అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ బాస్ లాంటి చాలా రకాల ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఈ లెక్కన చూసుకుంటే నాగార్జున గారు సినిమాలు తీయకుండా అన్నపూర్ణ స్టూడియోస్ నుండి అలాగే ఇతర బిజినెస్ నుండి ఒక నెలకి మూడు కోట్ల వరకు సంపాదించగలరు