Actors Who Died During Filming : మూవీ షూటింగ్ మధ్యలో చనిపోయిన సెలబ్రిటీస్..
భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు.చనిపోవాల్సిందే చావు అనేది అనివార్యం. ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావ్ బ్రో అనే డౌట్ మీకు రావొచ్చు అయితే మన ఇండియన్ సినిమాలో కొంతమంది సెలబ్రిటీస్ సడన్ గా చనిపోవడం జరిగింది
అందులో కొంతమంది అయితే సినిమా షూటింగ్ మధ్యలో చనిపోయారు.Actors Who Died During Filming మరి కొంత మంది మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుందని టైంలో చనిపోయారు. ఇంకా కొంతమంది మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే చనిపోయారు అలాంటి కొంతమంది సెలబ్రిటీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
1. దివ్యభారతి గారు
చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చిన దివ్యభారతి గారు కేవలం.చేసింది కొన్ని సినిమాలు అయినాప్పటికీ అభిమానుల్లో అభిమానులు మంచి పేరును సంపాదించుకుంది కానీ తనకి 19 సంవత్సరాలు ఉన్నప్పుడే సినిమాలని అభిమానులను వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోయింది అయితే తను నటిస్తున్న ఆ రెండు సినిమాల షూటింగ్ దాదాపు అయిపోయే టైం లోనే తాను మరణించింది 1.అనిల్ కపూర్ గారితో లాడ్లా మూవీలో నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయింది అనే టైంలో దివ్యభారతి గారు చనిపోయారు.. దీంతో దివ్యభారతి గారి లాగే ఉండే శ్రీదేవి గారితో మిగిలిన సినిమాని కంప్లీట్ చేశారు అలాగే 2.తొలిముద్దు అనే తెలుగు సినిమా క్లైమాక్స్ షూటింగ్ టైంలో దివ్యభారతి గారు చనిపోవడంతో ఆ క్లైమాక్స్ ని అచ్చం దివ్యభారతి లాగా ఉండే రంభ గారిని తీసుకొని కంప్లీట్ చేశారు..
2. వి.రామచంద్ర రావు గారు
మన తెలుగు సినిమాలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి రామచంద్ర రావు గారు కృష్ణ గారి 100 వ సినిమా అల్లూరి సీతారామరాజు కి డైరెక్టర్ గా పని చేశారు కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించాడు. కృష్ణ గారు తలపెట్టిన ఈ ప్రయోజనాత్మక ప్రాజెక్టు మధ్యలో రామచంద్ర రావు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఎంతైనా కృష్ణ గారి 100వ సినిమా అలాగే ఈ సినిమా కృష్ణ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్. దీంతో మిగిలిన సినిమాని కృష్ణ గారే డైరెక్ట్ చేసి కంప్లీట్ చేశారు. సినిమాను రిలీజ్ చేసిన తర్వాత కృష్ణ గారు డైరెక్టర్ క్రెడిట్ ని కూడా రామచంద్ర రావు గారికి ఇచ్చారు
ఇది కూడా చూడు మావా👇❤️
Crazy Sentiments of Tollywood Directors
3.సౌందర్య గారు
సౌందర్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన నటనతో అందర్నీ కట్టిపడేస్తుంది అలాంటి సౌందర్య గారు సడన్ గా చనిపోవడం టాలీవుడ్ కి తీరని లోటుగా మిగిలిపోయింది.అయితే సౌందర్య గారు బాలకృష్ణ గారితో నర్తనశాల అనే సినిమా షూటింగ్ మధ్యలోనే హెలికాప్టర్ ప్రమాదం వల్ల చనిపోయింది దీంతో మూవీ టీం ఈ సినిమా షూటింగ్ చాలా సంవత్సరాలు వాయిదా వేశారు
4. గొల్లపూడి శ్రీనివాస్
గొల్లపూడి మారుతి రావు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన గొల్లపూడి శ్రీనివాస్ రావు గారు తన ఫస్ట్ సినిమా “పెళ్లి పుస్తకాన్ని” అజిత్ గారితో స్టార్ట్ చేశారు సినిమా షూటింగ్ 8 రోజులు బాగా హుషారుగా జరిగింది. కానీ తొమ్మిదవ రోజు వైజాగ్ బీచ్ లో షూటింగ్ చేస్తున్న టైంలో అనుకోకుండా ఒక పెద్ద అల వచ్చి మారుతి రావు గారిని ఢీ కొట్టింది దీంతో మారితే రావు గారు కూడా అలతో సముద్రంలోకి వెళ్లిపోయాడు Actors Who Died During Filming ఇదంతా కొన్ని సెకండ్స్ లో జరిగిపోయింది కొద్దిసేపటి తర్వాత చనిపోయి సముద్రం మీద కనిపించారు తన ఫస్ట్ సినిమా షూటింగ్ మధ్యలోనే ఒక డైరెక్టర్ ఇలా చనిపోవడం చాలా బాధాకరం దీంతో గొల్లపూడి మారుతి రావు గారే మిగిలిన సినిమాని డైరెక్ట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు.
5. శోభన్ గారు
ప్రభాస్ అన్న సినిమాల్లో వర్షం సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్ లో ఈ సినిమా ప్రభాస్ అన్నకి స్టార్ ఇమేజ్ నిచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ శోభన్ గారు పునీత్ రాజ్ కుమార్ గారితో ఒక సినిమాని అనౌన్స్ చేశారు సినిమాకి ముహూర్తం కూడా జరిగింది. అలాగే భూమిక చాలా గారికి ఒక స్టోరీ చెప్పే సమయంలో గుండెపోటు వల్ల సడన్ గ కింద పడిపోయాడు అప్పుడు భూమిక గారు వల్ల హస్బెండ్ ఇద్దరు కలిసి హైదరాబాద్లోని ఇమేజ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ అప్పటికే శోభన్ గారు చనిపోయారని చెప్పడం జరిగింది. మహేష్ బాబు గారితో బాబి ప్రభాస్ గారితో వర్షం రవితేజ గారితో చంటి లాంటి మంచి మంచి సినిమాలు తీసిన శోభన్ గారు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం.
6. శ్రీదేవి గారు
శ్రీదేవి గారు వెండితెర సంచలనం తమిళ్ నుండి వచ్చిన తాను తన తన యాక్టింగ్ తో ఇండియా మొత్తం కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీదేవి గారు తర్వాత హీరోయిన్గా ఆ తర్వాత కొన్ని రోజులకు స్టార్ హీరోయిన్ అయింది. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి కొన్ని సంవత్సరాలు బాలీవుడ్ ని రోల్ చేసింది మన ఇండియన్ సినిమాలో మొదటిసారి ఒక కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో అనేసరికి అందరూ చిరంజీవి గారిని కరెక్ట్ గా చెప్తారు కానీ మొదటిసారి ఒక్కొక్కటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరు చాలామందికి తెలిసి ఉండదు తాను ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి గారు అలాంటిది శ్రీదేవి గారు తనకి కేవలం 54 సంవత్సరాలు ఉన్నప్పుడు 2018 లో మద్యం మత్తులో బాత్ టబ్ లో పడి చనిపోయింది తను చనిపోయేటప్పుడు కలంక్ అనే సినిమాలో నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే తాను చనిపోయింది దీంతో మూవీ టీం తన ప్లేసులో మాధురి దీక్షిత్ గారిని తీసుకున్నారు..
7. శ్రీహరి గారు
స్టంట్ మాస్టర్ గా తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేసిన శ్రీహరి గారు ఆ తర్వాత విలన్ గా ఆ తర్వాత హీరోగా అంచలంచెలుగా ఎదిగారు. నిజానికి మన ఇండియన్ సినిమాలో మొదటిసారి పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ ను పెంచింది శ్రీహరి గారే. యాక్టర్ గా దాదాపు 100 సినిమాల్లో నటించాడు హీరోగా 28 సినిమాల్లో నటించడం జరిగింది.Actors Who Died During Filming శ్రీహరి గారు 2013లో ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన “రాంబో రాజ్ కుమార్” సినిమా కోసం ముంబై కి వెళ్లారు. అయితే ఒక రోజు అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యారు దీంతో దగ్గరే ఉన్న లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లారు అప్పటికే పరిస్థితి ఉంచడంతో శ్రీహరి గారు చనిపోయారు నిజానికి దానికంటే ముందు శ్రీహరి గారు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అది తెలియని డాక్టర్స్ తన కడుపులోకి నేరుగా పైపులని గుచ్చడంతో అవి డైరెక్ట్ గా లివర్ కి తాకాయి.. దీంతో శ్రీహరి గారు ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు