Actors Playing Same Roles- ప్రతి సినిమాలో ఒకటే పాత్ర చేస్తున్న యాక్టర్స్..
ఒక సినిమా కోసం చాలామంది పనిచేస్తారు అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర చేస్తారు మములుగా యాక్టర్స్ సినిమా సినిమాకు చేసే పాత్రలకి చాలా డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటారు ఎ యాక్టర్ కూడా ఒక్కెరకమైన పాత్రలను చెయ్యాలని అనుకోడు కానీ కొంత మంది యాక్టర్స్ చాలా సినిమాల్లో ఒకే రకమైన పాత్రలను చెయ్యాల్సి వస్తుంది డైరెక్టర్స్ కూడా వాళ్ళకి సినిమా సినిమాకి వేరే పాత్ర కాకుండా ఒకే పాత్ర ఇస్తున్నారు ఆ యాక్టర్స్ ఎవరో తెలుసుకోండి
1.జయరామ్ గారు
జయరామ్ గారు ఇప్పటి వరకు తమిళ్ మలయాళం తెలుగులో కలిపి దాదాపు 200 కంటే ఎక్కువ సినిమాలోని నటించాడు కానీ రీసెంట్ గా నటించిన కొన్ని తెలుగు సినిమాలో తానకు ఒకే రకమైన పాత్ర ఇస్తున్నారు సినిమాల్లో జయరామ్ గారు భార్య తో కలిసి ఉండదు భార్యతో ఏదో ఒక్క గొడవ పెట్టుకొని తనతో మాట్లాడకుండా భార్యకు దూరంగా తనతో సంసారం చెయ్యకుండా ఉండే పాత్రలే చేస్తున్నాడు హాయ్ నాన్న..అలా వైకుంఠపురంలో.. గుంటూరు కారం.. ఇలా మొదలైన చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలే చేశాడు
2. రాజీవ్ కనకాల గారు
మన సినీ ఇండస్ట్రీలో చనిపోయే క్యారెక్టర్ అనేసరికి అందరికీ రాజీవ్ కనకాల గారి గుర్తుకొస్తారు. అయితే చనిపోయే క్యారెక్టర్ రాసిన తర్వాత అతని కాస్ట్ చేస్తారా లేదంటే తన కోసమే చనిపోయే క్యారెక్టర్ రాసుకుంటారు తెలియదు కానీ తాను నటించిన దాదాపు చాలా సినిమాలో చనిపోయే క్యారెక్టర్ చేశాడు కొన్ని కొన్ని సినిమాల్లో అసలు ఎందుకు చనిపోతాడో కూడా తెలియదు చాలా చిన్న చిన్న రీజన్స్ కి తన పాత్రను డైరెక్టర్ చంపేస్తారు. ఇక్కడ హైలెట్ ఏంటంటే రాజీవ్ గారు ఒక సినిమాలో చనిపోయే క్యారెక్టర్ చేశాడు అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది అని మన టాలీవుడ్ లో ఒక్క సెంటిమెంట్ అయితే ఉంది.
3. నదియా గారు
నదియా గారు చాలా సంవత్సరాలకి మళ్ళీ మిర్చి మూవీతో రీఎంట్రీ ఇచ్చింది రీ ఎంట్రీ తర్వాత తాను చాలా వరకు ఒకే రకమైన పాత్రలు చేస్తుంది తను సినిమాలో పేరెంట్స్ తో గాని లేదంటే భర్తతో గాని గొడవ పెట్టుకొని వాళ్లకు దూరంగా ఉండే పాత్రలే చేస్తుంది మిర్చి అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో అది మనం గమనించవచ్చు
4. శ్రీలీల గారు
ప్రజెంట్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా హీరోయిన్ శ్రీలీల. ఐదు నెలల్లో తను నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి అంటే నెలకొక సినిమా అన్నమాట 2023 సెప్టెంబర్ లో స్కంద.. అక్టోబర్ లో భగవంత్ కేసరి.. నవంబర్ లో ఆదికేశవ.. డిసెంబర్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్..2024 జనవరిలో గుంటూరు కారం.. అయితే ఈ సినిమాలోని చూస్తే తనను కేవలం ఒక భగవంత్ కేసరి తప్ప మిగిలిన అన్ని సినిమాల్లో తనని కేవలం డాన్స్ కోసమే తీసుకున్నారేమో అనిపిస్తుంది తాను ఇప్పటికైనా కేవలం డాన్స్ కాకుండా కొంచెం స్టోరీ సెలక్షన్ మీద దృష్టి పెడితే బాగుంటుంది