Crazy Sentiments of Tollywood Directors : మన డైరెక్టర్స్ కి ఉన్న బుర్రపాడు సెంటిమెంట్స్
ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా సినిమా తీస్తాడు. కొంతమంది తొందరగా సినిమాని కంప్లీట్ చేస్తే ఇంకా కొంత మంది చాలా టైం తీసుకుంటారు. సుకుమార్ గారి ఫ్లాప్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ మూవీస్ లా ఉంటాయి కానీ మరికొందరి డైరెక్టర్ల బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా పెద్ద నచ్చవు. బోయపాటి శ్రీను గారు కేవలం యాక్షన్ మూవీస్ తీస్తారు మరికొందరు కేవలం లవ్ స్టోరీస్ తీస్తారు.
మామూలుగా ఇండస్ట్రీలో రాజమౌళి అండ్ బాబీ లాంటి కొంతమంది డైరెక్టర్స్ కేవలం పెద్ద హీరోస్ తోనే సినిమా తీస్తారు.. కానీ ఇంకా కొంతమంది ఎవరితో అయిన సినిమా తీయడానికి సిద్ధంగా ఉంటారు. శంకర్ లాంటి డైరెక్టర్ ఒక సాంగ్ కి 10 నుండి 15 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు కానీ అడివి శేష్ గారు అదే డబ్బుతో ఒక సినిమాని తీయగలరు.
ఇలా ఫిలిం మేకింగ్ అనేది డైరెక్టర్ కి డైరెక్టర్ కి Crazy Sentiments of Tollywood Director వేరువేరుగా ఉంటుంది అయితే మామూలుగా కొన్ని విషయాలు లేదా కొన్ని సాంగ్స్ లేదా కొన్ని సీన్స్ కొంతమంది డైరెక్టర్ల సినిమాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. శేఖర్ కమ్ముల గారికి రెయిన్ సీన్ సాంగ్స్ అంటే ఇష్టం.. బోయపాటి గారికి పబ్లో సాంగ్ ఎక్కువ గా ఉంటాయీ.. లోకేష్ కనకరాజ్ లాంటి కొంతమందికి ఇంగ్లీష్ రాప్ సాంగ్స్ అంటే ఇష్టం. నెల్సన్ గారి సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ సాంగ్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటివి వాళ్ళ వాళ్ళ సినిమాల్లో మాక్సిమం కనిపిస్తాయి.. ఈ విధంగా డైరెక్టర్స్ కి ఉన్న ఇష్టాలని.. సెంటిమెంట్స్ ని.. అలవాట్లని ఫాంటసీలని… ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు
త్రివిక్రమ్ గారికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి 1. ప్రతి సినిమాలో మహాభారతం రిఫరెన్స్ ఉంటుంది మహాభారతంలోని డైలాగ్స్ తన సినిమాలో పెట్టకుండా ఉండలేడు 2. ఇండస్ట్రీలో హీరోస్ లేరు అన్నట్టుగా తాను కేవలం ఇద్దరు ముగ్గురు హీరోస్ తోనే సినిమాలు చేస్తారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇందులో ఒకరితో సినిమా తర్వాత ఇంకొకరితో చేస్తారు 3.తన సినిమాలో మాక్సిమం ఒకే స్టోరీ ఉంటుంది హీరో ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం లేదంటే ఎవరైనా ఇంట్లో నుండి బయటకు వెళ్తే వాళ్లను హీరో ఇంట్లోకి తీసుకురావడం
4.తన సినిమాలో కచ్చితంగా సెకండ్ హీరోయిన్ ఉండాల్సిందే హైలెట్ ఏంటంటే ఫస్ట్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ బాగుంటుంది 5. అలాగే తన సినిమాలోని హీరోయిన్స్ కి ఏదో డిసార్డర్ ఉంటుంది 6.కారణం ఏంటో తెలీదు గానీ త్రివిక్రంగారి దాదాపు అన్ని సినిమాల్లో పమ్మి సాయి గారిని తీసుకుంటారు 7. త్రివిక్రమ్ గారి సినిమాల్లో హీరో విలన్స్ ని చంపడం ఏదో ఒక రీజన్ వల్ల విలన్ నే చనిపోతాడు
2. రాఘవేంద్ర రావు గారు
రాఘవేంద్ర గారు తన డైరెక్షన్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు తను గడ్డం గీసుకోడు ఒకవేళ గడ్డం తీసుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుద్దని తన సెంటిమెంట్ అలా చాలాసార్లు జరిగిందంట. అలాగే రాజమౌళి గారు కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుండి రిలీజ్ చేసే వరకు గడ్డం తీసుకోరు. రాఘవేంద్ర గారికి ఇంకొక క్రేజీ సెంటిమెంట్ ఉంది హీరోయిన్స్ ని సాంగ్స్ లో కొత్తగా పరిచయం చేస్తారు. అలాగే సాంగ్స్ లో హీరోయిన్స్ ని ఫ్రూట్స్ తో కొట్టడం సెంటిమెంట్. ఒకవేళ ఫ్రూట్స్ లేకుంటే వేరే దగ్గర నుండి అయిన తెప్పిస్తాడు కానీ హీరోయిన్స్ ను ఫ్రూట్స్ తో కొట్టకుండా ఉండలేడు.
3. గుణశేఖర్ గారు
గుణశేఖర్ గారు డైరెక్టర్ గా ఇప్పటివరకు చాలా సినిమాలను డైరెక్ట్ చేశాడు అయితే ఇప్పటికీ చెప్పిన డేట్ కి ఏ సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. ముందు ఒక డేట్ చెప్పడం తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఇండస్ట్రీ లో చాలా మామూలే, అలా ఒకటి రెండు సినిమాలకైతే పర్వాలేదు కానీ గుణశేఖర్ గారి మాక్సిమం అన్ని సినిమాలకు అలానే జరిగింది. తన మొదటి సినిమా లాటి నుండి లాస్ట్ టైం రిలీజ్ అయిన శకుంతలం వరకు ప్రతి సినిమా పోస్ట్ పోన్ చేశారు
ఇది కూడా చూడు మావా👇🥺
4. కరుణాకరన్ గారు
కరుణాకర్ గారికి వైట్ డ్రెస్ అంటే సెంటిమెంట్ తన సినిమాల్లో హీరోయిన్స్ వైట్ డ్రెస్ తోనే ఎంట్రీ ఇస్తారు హ్యాపీ.. ఉల్లాసంగా ఉత్సాహంగా… డార్లింగ్.. తొలిప్రేమ.. చిన్న నీకోసం.. ఎందుకంటే ప్రేమంట.. ఇలా తను డైరెక్ట్ చేసిన సగం సినిమాల్లో హీరోయిన్స్ వైట్ డ్రెస్ లోనే ఎంట్రీ ఇవ్వడం జరిగింది
5.సుజీత్ గారు
సుజీత్ గారు తీసింది 2 సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది.అయితే సుజీత్ గారికి కూడా ఒక్క సెంటిమెంట్ ఉంది అది సెంటిమెంట్ అనే దానికన్నా coincidence అంటే బాగుంటది ఎందుకంటే తన మొదటి సినిమా రన్ రాజా రన్ 2014 లో సహో 2019 లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తియ్యబోతున్న OG మూవీ 2024 లో రిలీజ్ అయ్యబోతుంది. ఈ లెక్కన చూస్తే ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి సుజిత్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి
6. హాను రాఘవపూడి
అందాల రాక్షసి సినిమాతో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి గారుకి సెకండాఫ్ సిండ్రోమ్ ఉంది. సెకండ్ ఆఫ్ సిండ్రోమ్ అంటే ఏంటి బ్రో అనే డౌటు మీకు రావచ్చు.Crazy Sentiments of Tollywood Director హను రాఘవపూడి గారు అందాల రాక్షసి తర్వాత పడి పడి లేచే మనసు.. లై.. సీత రామం… లాంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు అయితే తన సినిమాల్లో మనం గమనిస్తే సెకండాఫ్ కంటే ఫస్ట్ అఫ్ బాగుంటుంది. అందుకే తన సినిమాలు ఫస్ట్ ఆప్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ వల్ల సినిమాలు పెద్దగా ఆడలేకపోయాయి.
దీన్నే సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు. ఈ విషయాన్ని సీతారామo మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాను రాఘవపూడి గారే స్వయంగా చెప్పారు. అలాగే సీతారామ మూవీతో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటానని మాట ఇచ్చాడు.చెప్పినట్టుగానే మొత్తానికి సీతారామ మూవీతో ఆ ప్రాబ్లం ని సరి చేసుకున్నాడు.
6.VV వినాయక్ గారు
ఒక్కప్పుడు రాజమౌళి గారి తరువాత అంత రేంజ్ ఉన్న VV వినాయక్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయ్ 1.తన సినిమాల్లో కచ్చితంగా హీరోస్ డబుల్ రోల్ చెయ్యాల్సిందే అలాగే 2.తన చాలా సినిమాల్లో హీరోయిన్ కి పేరు నందిని అనే పెట్టారు అలాగే తన అలాగే తన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ కచ్చితంగా ఉంటుంది..
7. రాజమౌళి గారు
రాజమౌళి గారికి బ్లాక్ బస్టర్ మూవీస్ తీయడం అంటే సెంటిమెంట్ తనకి యావరేజ్ అంటే ప్లాప్ మూవీస్ అంటే ఎలా ఉంటాయో కూడా తెలియదు Crazy Sentiments of Tollywood Director 1.రాజమౌళి గారు ఇప్పటిదాకా తీసింది 12 సినిమాలు ఆయినప్పటికీ ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాయి అలాగే తన సినిమాల్లో 2.విలన్స్ ని హీరోస్ కంటే పవర్ఫుల్ గా చూపిస్తాడు వేరే డైరెక్టర్స్ లా కాకుండా 3.సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమా గురించి ఓవర్ గా ఎక్కడ కూడా మాట్లాడాడు
4.అలాగే రాజమౌళి గారి సినిమాలో చత్రపతి శేఖర్ గారు ఉండాల్సిందే కెరీర్ స్టార్టింగ్ లో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన స్నేహమే దీనికి కారణం 5.అలాగే ఇండియన్ సినిమా స్థాయిని పెంచకుండా ఉండలేడు. 6.రాజమౌళి గారు కూడా కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కి ఇందు లేదా బిందు అనే పేర్లు పెట్టేవాడు తర్వాత డౌట్ వస్తుంది ఏమో అని అలా పేర్లు పెట్టడం మానేశాడు అలాగే 7.తన సినిమాల్లో విలన్సుని చంపడానికి ఒక డిఫరెంట్ వెపన్ క్రియేట్ చేస్తాడు 8.వీటితో తన మాక్సిమం సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.
8. రాఘవ లారెన్స్ గారు
ఇండియన్ సినిమాలో రాఘవ లారెన్స్ గారు దయ్యాలను వాడినంతగా ఏ డైరెక్టర్ కూడా వాడి ఉండడు. తన మాక్సిమం సినిమాలో దెయ్యాలు ఉంటాయి దేశంలో ఇంక ఎవరు లేరన్నట్టుగా అన్ని దయ్యాలు లారెన్స్ గానే పడతాయి. అలాగే రాఘవ లారెన్స్ గారు తన సినిమాల్లో దెయ్యాలకి తన బాడిని రెంట్ కి ఇస్తాడు. దాదాపు తన సినిమాలోని సాంగ్స్ లో హ్యాండీక్యాప్డ్ వాళ్ళని చూపిస్తాడు. రావులారం సారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో క్లైమాక్స్ లో ఫైట్ అనేది చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుంది. డాన్ బిల్లా మాస్ క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే మనకే అర్థమవుతుంది.
9. లోకేష్ కనుగరాజ్
ప్రజెంట్ ఇండియాలో యంగ్ డైరెక్టర్స్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో ఖచ్చితంగా బిర్యాని సీన్ ఉండాల్సిందే తను తీసే సినిమాలు LCU తో సంబంధం ఉన్న లేకున్నా ప్రతి సినిమాలో డ్రగ్స్ ఉండాల్సిందే. లోకేష్ కనకరాజ్ కి లవర్స్ అంటే నచ్చదో ఏమో తెలియదు కానీ తన దాదాపు అన్ని సినిమాల్లో లవర్స్ ని ఎక్కడున్న వెతికి మరి చంపేలా స్టోరీ రాసుకుంటాడు
అలాగే లోకేష్ కాని రాజు గారికి సినిమాల షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయడం అలవాటు. తన ఫస్ట్ సినిమా నగరాన్ని కేవలం 45 రోజుల్లోనే కంప్లీట్ చేశాడు తర్వాత ఖైదీ మూవీని 62 రాత్రుల్లో… ఆ తర్వాత మాస్టర్ మూవీని 129 రోజుల్లో.. విక్రమ్ ను 110 రోజుల్లో.. అలాగే లియో మూవీని 125 రోజుల్లో కంప్లీట్ చేశాడు…
10. సుకుమార్ గారు
రాజమౌళి తర్వాత తెలుగులో అంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ సుకుమార్ గారు. నిజానికి సుకుమార్ గారి ఫ్లాప్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలాగా ఉంటాయి రీజనల్ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలాగా ఉంటాయి. తన సినిమాలో కచ్చితంగా లాజిక్స్ ఉంటాయి లాజిక్స్ లేకుండా సినిమా తియ్యడు. అలాగే తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి ఐటెం సాంగ్స్ లో సుకుమార్ గారిని కొట్టే డైరెక్టర్ ఇండియాలో లేడు అని చెప్పాలి.
11. విక్రమ్ కుమార్ గారు
చిన్నప్పటి లవరో లేదంటే రిలేటివో తెలీదు కానీ విక్రమ్ కుమార్ గారి సినిమాల్లో హీరోయిన్ కి ప్రియా అనే పేరు ఉండాల్సిందే. హలో.. మనం.. థాంక్యూ.. గ్యాంగ్ లీడర్.. 24.. ఇష్క్.. ఇలా దాదాపు తను డైరెక్ట్ చేసిన సగం సినిమాల కంటే ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ కి ప్రియ అనే పేరు పెట్టాడు. లాస్ట్ కి అసలు ప్రియా అంటే ఎవరని సుమా గారు గ్యాంగ్ లీడర్ మూవీ ప్రమోషన్స్ లో అడిగింది.. అప్పుడు “ప్రియ అనే పేరు వినడానికి అనడానికి బాగుంటుంది అందుకే నా సినిమాల్లో మాక్సిమం ప్రియా అనే పేరు పెడతాను” అని ఏదో ఒకటి చెప్పి విక్రమ్ కుమార్ గారు ఎస్కేప్ అయ్యాడు.
12. శంకర్ గారు
శంకర్ గారి సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక్క మెసేజ్ ఉంటుంది అలాగే సినిమాలని కొత్తగా తీయడంలో ముందు ఉంటాడు.మన ఇండియన్ సినిమాలో ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి డైరెక్టర్ గా తనకి పేరు ఉంది. అందరూ డైరెక్టర్స్ లా కాకుండా తాను బడ్జెట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడు. ఒక సినిమా అయ్యే ఖర్చును కేవలం ఒక సాంగ్ కే పెడతాడు ఒక సాంగ్ కి 10 నుండి 20 కోట్లు ఖర్చుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన సాంగ్స్ లో డ్రెస్సింగ్ స్టైల్ గాని చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటాయి..
13. ప్రశాంత్ నీల్
ప్రశాంత్ నీల్ గారికి బొగ్గంటే సెంటిమెంట్ తన ప్రతి సినిమాలో బొగ్గు ఉండాల్సిందే ఒకవేళ బొగ్గు సరిపోకుంటే వేరే స్టేట్ నుండి అయిన తెప్పిస్తాడు కానీ షూటింగ్ అయితే అస్సలు ఆపడు. బయట యాక్టర్స్ ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉన్నప్పటికీ తన సినిమాలోకి వచ్చక యాక్టర్స్ అందరూ బొగ్గులో బొగ్గు అవ్వాల్సిందే. అలాగే తన సినిమాలకి కలెక్షన్లు వందల కోట్లు వచ్చినప్పటికీ అవార్డ్స్ అయితే పెద్దగా రావు… ప్రజెంట్ ఒక హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ గారి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు
14. వెంకీ అట్లూరి
వెంకీ అట్లూరి గారికి ఫారెన్ కంట్రీస్ అంటే ఇష్టమో లేదంటే ఇంకేదైనా రీజనో తెలియదు కానీ తన సినిమాలో హీరోస్ సెకండ్ హాఫ్ లో ఫారెన్ వెళ్లాల్సిందే. తొలిప్రేమ రందే Mr మజ్ను ఇలా దాదాపు తన సినిమాలో హీరోస్ ఫారిన్ కంట్రీస్ కి వెళ్తారు
15. డైరెక్టర్ బాబి గారు
పవర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ బాబి గారు మాక్సిమం తన సినిమాలని పెద్ద హీరోస్ తోనే తీస్తాడు ఇప్పటివరకు చిరంజీవి పవన్ కళ్యాణ్ రవితేజ ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద హీరోస్ తోనే సినిమాలు తీశాడు. సినిమాలు తీయకుండా ఖాళీగా అయినా ఉంటాడు కానీ చిన్న హీరోస్ తో మూవీస్ అయితే చేయడు ఇప్పుడు కూడా బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నాడు..
16. శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల గారికి మంచి ఫీల్ గుడ్ సినిమాలు తీయడం అంటే సెంటిమెంట్ అలాగే తను తీసిన సినిమాలను ముందుగా ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎగబడి చూసి Underrated అంటారు సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటాడు. అలాగే తన సినిమాల్లో హీరోయిన్స్ రెన్ లో డ్యాన్స్ చేసేలా ఒక సాంగ్ ఉంటుంది
17. వెట్రి మారన్
ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలో రియాలిటీ కి దగ్గరగా సినిమాలు తీస్తున్న డైరెక్టర్ వెట్రి మారన్. తన సినిమాలు రియాల్టీకి చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే తన సినిమాలన్నీ సమాజంలో అణచివేతకు గురికాబడ్డ కొన్ని వర్గాల గురించే తన సినిమాలు ఉంటాయి. ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్స్ మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే వెట్రి మారన్ గారికి స్టార్ హీరో అయిన నార్మల్ యాక్టర్ అయినా ఇద్దరు ఒకటే. ఎంత పెద్ద హీరోస్ అయినా వెట్రి మారన్ గారు ఏది చెప్తే అది చేయాలి
18. బోయపాటి మావా
బోయపాటి గారి సినిమాలో చాలా సీన్స్ సృష్టికి విరుద్ధంగా ఉంటాయి తన సినిమాలో గ్రావిటీ అనేది లేకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఒక ఫ్యామిలీ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవర్నో ఒకరిని లేపేస్తాడు తన సినిమాలో ఫ్యాన్స్.. గాలి… కచ్చితంగా ఉండాల్సిందే పోయే గారి సినిమాలో హీరోస్ నార్మల్ మనుషులు లాగా కాకుండా సూపర్ హీరోస్ లో ప్రవర్తిస్తారు.
19. అట్లీ గారు
రాజా రాణి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అట్లీ గారు రీసెంట్ గానే జవాన్ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు అయితే తన సినిమాలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి మామూలుగా తన సినిమాల్లో హీరో హీరోయిన్స్ లో ఎవరైనా ఒకరు చనిపోవాల్సిందే రాజా రాణి సినిమాలో నజ్రియా.. పోలీసోడు సినిమాలో సమంత… అదిరింది సినిమాలో నిత్యమీనన్… జవాన్ సినిమాలో దీపిక పదుకొనే.. ఇలా ఎవరికో ఒకరికి పిండం పెట్టకుండా ఉండలేడు అలాగే తన సినిమాలో హీరోస్ కి మాక్సిమం డబల్ రూల్స్ ఉంటాయి. అలాగే సినిమా సినిమాకి కలెక్షన్స్ పరంగా క్రేజ్ పరంగా పేరు పెంచుకుంటూనే వస్తున్నాడు.
20. పూరి జగన్నాథ్
పూరి గారి సినిమాల్లో హీరోస్ మాక్సిమం అనాధలు గానే ఉంటారు స్టార్టింగ్ లో వెధవల్లాగా ఉండి క్లైమాక్స్ వచ్చేసరికి మంచిగా మారతారు. అలాగే పూరి గారి సినిమాలో కచ్చితంగా ఒక బీచ్ సాంగ్ ఉండాల్సిందే దీంతోపాటు పోలీస్.. మాఫియా.. బూతులు… హీరో క్యారెక్టర్జేషన్.. సూరి గారు తన సినిమాలకి స్టోరీని చాలా వరకు బ్యాంకాక్ లోనే రాస్తారు పూరి గారి సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయిన తెలుగు ఇండస్ట్రీలో పూరి గారి క్రేజ్ ఏ మాత్రం అస్సలు తగ్గదు