Mega Heroes With Same Movies : ఒకే రకమైన సినిమాలు తీసిన ఇద్దరు మెగా హీరోస్
ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ నుండి కొన్ని వేల సినిమాలో రిలీజ్ అవుతాయి. అందులో చాలా సినిమాలు చూస్తున్నాడు ఇంతకుముందే ఈ సినిమా ఎక్కడో చూసామే అన్నట్టు అనిపిస్తుంది. Mega Heroes With Same Movies సినిమాల్లో కొత్తదనం పెద్దగా కనిపించట్లేదు. కొంతమంది డైరెక్టర్స్ అయితే ఆ సినిమాని ఈ సినిమాని కలిపి ఇంకొక కొత్త సినిమా తీస్తున్నారు. మామూలుగా
ఇండస్ట్రీలో ఒక సినిమాను పోలిన ఇంకొక సినిమా రావడం చాలా కామన్. ఎందుకంటే ఆ సినిమాల్లోని స్టోరీ గానీ స్టోరీ లైన్ గాని లేదా కాన్సెప్ట్ గాని ఒకటే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మెగా హీరోస్ సినిమాల్లో కూడా జరిగింది. ఆల్రెడీ ఒక మెగా హీరో తీసిన సినిమా స్టోరీ తోనే ఇంకొక మెగా హీరో సినిమా తీశాడు ఆ మెగా హీరోస్ ఎవరో తెలుసుకుందాం..
1. రామ్ చరణ్ (రచ్చ) అల్లు అర్జున్ (బన్నీ)
బన్నీ హీరోగా వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2008లో విడుదలైన మూవీ బన్నీ ఇందులో అల్లు అర్జున్, గౌరి ముంజల్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాకి పాజిటివ్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి అలాగే…
2012 లో సంపత్ నంది డైరెక్షన్లో రామ్ చరణ్ తమన్నా హీరో హీరోయిన్స్ గా వచ్చిన రచ్చ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ మరియ మలయాళంలో అనువాదించబడిన ఈ సినిమా మూడు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. సినిమాకి టోటల్ 30 కోట్లు ఖర్చు పెడితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 45 గ్రాస్ ని కలెక్ట్ చేసింది…
ఇది కూడా చూడు మావా👇
నిజానికి ఈ రెండు సినిమాల స్టోరీలకి పెద్దగా తేడా లేదు. 2008 మీద రిలీజ్ అయిన బన్ని సినిమాలో ఆస్తి తనది అని హీరోకి తెలుసు కానీ హీరోయిన్ కి తెలియదు. అలాగే 2012లో రిలీజ్ అయిన రచ్చ సినిమాలో ఆస్తి తనదే అని హీరోకి తెలియదు కానీ తమన్నాకి తెలుసు మిగతా స్టొరీ అంతా మాక్సిమం ఒకేలా ఉంటుంది ఈ సినిమాలో తండ్రి పాత్ర చేసిన వాళ్లు కూడా ఇద్దరు తమిళ్ యాక్టర్స్. ఈ విధంగా ఆల్రెడీ బన్నీ చేసిన మూవీ స్టోరీ తోనే రామ్ చరణ్ గారు సినిమా తీశారు ఈ రెండు మంచి సూపర్ హిట్ అయ్యాయి.
2. పవన్ కళ్యాణ్(అత్తారింటికి దారేది) రామ్ చరణ్(గోవిందుడు అందరివాడేలే)
2013 పవన్ కళ్యాణ్ గారు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే సినిమా ఇంట్లో గొడవ వల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయి తాతకు దూరంగా ఉంటున్న అత్తను మళ్లీ ఇంటికి తీసుకురావడానికి మనవడు చేసిన ప్రయత్నమే ఈ సినిమా.
అలాగే రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా వచ్చింది ఈ సినిమాలో కూడా అమ్మమ్మ తాతలతో గొడవపడి అక్కడెక్కడ విదేశాల్లో ఉంటున్న వాళ్ళ కొడుకుని కలపడమే మనవడు చూసే ప్రయత్నమే ఈ సినిమా స్టోరీ అయితే ఇందులో అత్తారింటికి దారేది సినిమా అత్త కోసం ఉంటే గోవిందుడు. అందరి వాడేలే సినిమా ఫాదర్ కోసం ఉంటుంది.. ఇంతే తప్ప ఈ రెండు సినిమా స్టోరీలో పెద్దగా తేడా లేదు ఈ రెండు సినిమాలు కేవలం ఒక సంవత్సరం గ్యాప్ లోనే వచ్చాయి ఈ విధంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా స్టోరీ తోనే రామ్ చరణ్ గారు ఇంకొక సినిమా తీశాడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు తీసిన అత్తారింటికి దారేది సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా పెద్దగా ఆడలేదు