Sad For These Celebrities _బంధువులే కదా అని ఛాన్స్ ఇస్తే రాడ్ దింపారు

Sad For These Celebrities _బంధువులే కదా అని ఛాన్స్ ఇస్తే రాడ్ దింపారు

 

Sad For These Celebrities
Sad For These Celebrities

 

 

Sad For These Celebrities ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ దగ్గర నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న సెలబ్రిటీస్ వరకు అందరూ వాళ్ల రిలేటివ్స్ ని దగ్గర వాళ్ళను సినిమాల్లోకి తీసుకురావడం లేదా వాళ్లకి సినిమాలలో ఛాన్సెస్ ఇవ్వడం లాంటివి చేస్తారు ఇలాంటి సినిమా ఫీల్డ్ లోనే కాకుండా ప్రతి ఫీల్డ్ లో జరుగుతుంది అయితే ఇలానే కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ బంధువులకి నమ్మే డైరెక్టర్స్ గా ఛాన్స్ ఇస్తే వాళ్లు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే రాడు రాంబోలా మూవీస్ తీశారు వాళ్ళు ఎవరో ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం

 

1.రజినీకాంత్ గారు

సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి ఇద్దరు కూతుర్లు (ఐశ్వర్య రజినీకాంత్ సౌందర్య రజనీకాంత్) ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు అయితే రజనీకాంత్ గారు ఇద్దరు కూతుర్లను నమ్మి ఇద్దరికీ డైరెక్టర్ గా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు అందులో సౌందర్య గారు కొచ్చడయాన్ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ తీసింది. అప్పట్లో ఈ సినిమా మామూలు రాడు కాదు అలాగే ఐశ్వర్య గారు చాలా సంవత్సరాల తర్వాత జైలర్ మూవీతో కం బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ గారికి లాల్ సలాం అనే ఇంకొక డిజాస్టర్ మూవీ ఇచ్చింది నమ్మకంతో మరి రజినీకాంత్ గారి లాంటి స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే తన నమ్మకన్ని నిలబెట్టుకోలేకపోయారు

Don’t Mess With Sandeep Reddy

 

2. చిరంజీవి గారు

2013లో రిలీజ్ అయిన షాడో మూవీ తరువాత మెహర్ రమేష్ గారు ఆల్మోస్ట్ కనుమరుగైపోయారు 2013 నుండి 2023 దాకా ఒక్క మూవీ కూడా అనౌన్స్ చేయలేదు దాదాపు 8 సంవత్సరాల నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహర్ రమేష్ గారికి వరసకి కజిన్ అవుతాడు కదా అని చిరంజీవి గారు మూవీ ఛాన్స్ ఇచ్చాడు కానీ మెహర్ రమేష్ గారు భోళా శంకర్ అనే రాడ్ మూవీ తీశాడు. మూవీతో మళ్లీ చిరంజీవి గారు రీమేక్ మూవీ జోలికి వెళ్లడనే చెప్పాలి చాలా సంవత్సరాలకి ఒక పెద్ద హీరో మూవీలో ఛాన్స్ వస్తే మెహర్ రమేష్ గారు మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి రాడ్ దింపాడు 

 

3.ధనుష్ గారు

ధనుష్ గారు వాళ్ళ వైఫ్ ఐశ్వర్య రజనీకాంత్ గారి డైరెక్షన్లో 3 అనే మూవీ చేశాడు సినిమాలో సాంగ్స్ కానీ BGM గానీ ఒక రేంజ్ లో ఉంటాయి కానీ స్టోరీ మాత్రం వీక్ గా ఉంటుంది ఈ మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ అయింది ఐశ్వర్య గాని సిస్టర్ సౌందర్య గారికి విఐపి2 మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది రఘువరన్ బీటెక్ లాగా ఈ సినిమా కూడా మంచి క్లాసిక్ హిట్ అవుతుంది అనుకున్నారు కానీ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు స్టోరీ పరంగా విఐపి2 3 మూవీ కంటే బానే ఉంటుంది మళ్లీ ఐశ్వర్య అండ్ సౌందర్య రజనీకాంత్ గారు అటు తండ్రికి ఇటు ధనుష్ గారికి ఫ్లాప్ మూవీస్ ఇచ్చారు

 

Leave a comment